ప్రపంచంలో జరిగే అన్నింటిని కూడా మన కాళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపించేది గూగుల్. కొత్త కొత్త టెక్నాలజీ ఎక్కడ ఉంది వీటిని వాడటం వల్లఎటువంటి ఉపయోగం ఉంది ఇలాంటి విషయాలను అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడంతో ఈ గూగుల్ నాలుగు అడుగులు ముందండనే చెప్పాలి. అయితే భాష రానిరాకుండా వేరే దేశాలకు లేదా వేరే రాష్ట్రాలకు వెళితే ఎన్ని ఇబ్బందులు పెడతామో అందరికి తెలిసిన విషయం. 

 

అయితే ఇప్పుడు గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్ ను మార్కెట్లోకి పరిచయం చేసింది. కొత్త ఫీచతో భాషలతో సమస్య లేకుండా అందరితో మాట్లాడవచ్చునట. తాజాగా గూగూల్‌ తీసుకొచ్చిన ఫీచర్‌ అదిరిపోయింది. అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ అందుబాటులో వచ్చింది. ఈ రియల్‌ టైమ్‌ ట్రాన్సలేషన్‌ ఫీచర్‌ను వాడుకుని ప్రపంచంలోని 44 భాషల్లో మాట్లాడవచ్చు. 

 

మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ ఇలా తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. ఈ ఫీచర్‌ ఓపెన్ చేసి వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. వెంటనే కావాల్సిన భాషలో ట్రాన్సలేషన్ చేస్తుంది. కొత్త భాషలు నేర్చుకునేవారికి ఈ ఫీచర్‌ సూపర్.అండ్రాయిడ్‌, ఐఫోన్లలో అందుబాటులో ఉంది. గూగుల్‌ అసిస్టెంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది.

 

గూగుల్‌ అసిస్టెంట్‌ ట్రాన్సలేషన్ ఎలా వాడాలో తెలుసుకుందాం
... మీ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ అసిస్టెంట్‌ను తెరిచి.. ఇంటర్‌ప్రిటెర్‌ మోడ్‌ను డైరెక్ట్‌గా వాడొచ్చు.‘ఓకే గూగుల్‌ లేదా హే గూగుల్‌’ అనే వాయిస్‌ కమాండ్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను తెరవచ్చు. అండ్రాయిడ్‌ ఫోన్లలో పవర్‌ బటన్‌ ప్రెస్‌ చేయడం ద్వారా గూగుల్‌ అసిస్టెంట్‌ ఓపెన్‌ అవుతోంది.- "Hey google, be my tamil translator" or "Hey google, help me english From Telugu" వంటి కమాండ్స్‌తో డైరెక్ట్‌గా ఇంటర్‌ప్రిటెర్‌ మోడ్‌ ఓపెన్‌ అవుతోంది.


మీకు ఏ భాష రాకుంటే.. ఆ భాషలో ఇంటర్‌ప్రెటెర్‌ మోడ్‌ను ఓపెన్‌ చేసి సంభాషించడమే. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్‌ అసిస్టెంట్‌ ట్రాన్స్ లేషన్  చేసి పెడుతుంది. కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే వారికి పనికొస్తుంది ఈ ఫీచర్‌. ఓకే ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కడికైనా కూడా వెళ్ళండి గూగుల్ ట్రాన్సులేషన్ ని వాడండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: