టెక్నాలజీ పరంగా 4జి...3జి లతో ప్రస్తుత సమాజం చాలా స్పీడ్ గా ఉంది. దీంతో చాలామంది టెక్నాలజీ వాడుతున్న వాళ్ళు ఫేస్ బుక్ అకౌంట్ ను కూడా మెయింటెన్ చాలా మంది చేస్తారు. ఇటువంటి తరుణంలో ఇటీవల హ్యాకర్ల దాడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో డేటా ఉల్లంఘనలు మరియు అదే విధంగా వ్యక్తిగత సమాచారం కూడా లీక్ అవుతున్నట్లు అనేక కంప్లైంట్లు వస్తున్న ఈ క్రమంలో తాజాగా కోట్ల మంది వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని కంపెయిర్‌టెక్‌, సెక్యూరిటీ పరిశోధకులు బాబ్‌ దియచెంకో నివేదిక వెల్లడించింది. 26.7 కోట్ల మంది ఎఫ్‌బీ యూజర్ల యూజర్‌ ఐడీలు, పేర్లు, ఫోన్‌ నంబర్ల వంటి వ్యక్తిగత డేటా ఓ డేటాబేస్‌ ఆన్‌లైన్‌లో నిక్షిప్తమైందని, ఈ డేటాబేస్‌ను ఎవరైనా ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్‌ లేకుండా యాక్సెస్‌ కావచ్చని నివేదిక బాంబు పేల్చింది.

 

వ్యక్తిగత మెసేజ్ లు మరియు ఫిషింగ్ దాడులు కోసం డేటాను హ్యాకర్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది సెక్యూరిటీ పరిశోధకులు తెలపడం జరిగింది. దీంతో ఈ విషయంపై ఫేస్‌బుక్‌ ఇంతమంది యూజర్ల డేటా హ్యాకర్ల మాయం చేయడం వెనుక భద్రతా లోపం ఉందని ఈ విషయాన్ని స్పందిస్తున్నామని యూజర్ల సమాచారాన్ని కాపాడేందుకు తాము మార్పులు చేపట్టక ముందు ఇది జరిగి ఉండవచ్చని వ్యాఖ్యానించింది.

 

మరోపక్క కోట్లాది ఎఫ్‌బీ యూజర్ల డేటాబేస్‌ ఎలా సాధ్యమైందనేది వివరిస్తూ ఫేస్‌బుక్‌ ఏపీఐలో భద్రతా లోపాల కారణంగానే హ్యాకర్లు ఈ పనికి పాల్పడి ఉంటారని దియచెంకో అంచనా వేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఫేస్బుక్ వాడుతున్న యూజర్లు ఇలాంటి హ్యాకర్లు ఎప్పుడు ఏదైనా చేయవచ్చు కనుక అకౌంటింగ్ ఎప్పటికప్పుడు లాగ్ అవుట్  చేస్తూ సేవ్ చేసుకోవటం మంచిది. కుదిరితే కొత్త పాస్వర్డ్ కూడా పెట్టుకోండి ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: