ప్రముఖ సర్చ్‌ ఇంజన్ సంస్థ గూగుల్‌కు భారీ జరిమాన పడింది.  ఆన్‌లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్‌లో గూగుల్‌ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై ఫ్రాన్స్‌ మండిపడింది.  గూగుల్‌లో వాణిజ్య ప్రకటనల్ని ఆమోదించడానికి అనుసరించే విధానాలు ఏ మాత్రం పారదర్శకంగా లేవని పేర్కొంటూ దాదాపు రూ. 1,180 కోట్ల జరిమానా విధించింది. ఆన్‌లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్‌లో గూగుల్ సంస్థ అవలంభిస్తున్న ఆధిపత్య ధోరణిపై మండిపడుతూ… ఫైన్ వేసిన దేశాల ఖాతాలో ఫ్రాన్స్‌ కూడా చేరింది.

 

వాణిజ్య ప్రకటనలను ఆమోదించడానికి గూగుల్ అనుసరిస్తున్న విధానాలు పారదర్శకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది.   గూగుల్‌లో ప్రకటనలు ఇచ్చే వారందరికీ ఒకే రకమైన నియమనిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ జరిమానా విధించింది. ఈ నేప‌థ్యంలోనే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో యాడ్స్‌ ఇచ్చే వారందరికీ ఒకే నియమాలు ఉండాలని గూగుల్‌కు ఫ్రాన్స్‌ స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే గూగుల్‌పై పలు దేశాలు వివిధ కారణాలతో భారీ జరిమానా విధించాయి. 

 

ఇప్పుడా జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. అయితే ఫ్రాన్స్ విధించిన జరిమానాపై అప్పీల్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. ఇక గ‌తంలో ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్(ఇయు) భారీ జరిమానా విధించింది. తన షాపింగ్ సర్వీస్‌లను ప్రమోట్ చేస్తూ, ప్రత్యర్థి కంపెనీల డీమోట్ చేస్తుందనేది గూగులపై ఉన్న ఆరోపణలు. దీనిపై విచారణ చేపట్టిన ఇయు యాంటీట్రస్ట్ విభాగం గూగుల్‌కు ఏకంగా రూ. 17570 కోట్లు జ‌రిమానా విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: