మంచి ఉద్దేశంతో హ్యాకింగ్ చేసేవారిని ఎథికల్ హ్యాకర్లని పిలుస్తారు. ఇంటర్నెట్ లో బడా సంస్థల వెబ్సైటుల సమస్యలను ఎథికల్ హ్యాకర్లు సులువుగా పరిష్కరిస్తారు. మన బ్యాంకు ఖాతాలలో డబ్బులను చెడు హ్యాకర్లు దొంగలించకుండా ఉండేలా బ్యాంకు సైట్లకు భద్రతను కలిగిస్తారు ఈ ఎథికల్ హ్యాకర్లు. అలాగే మన వ్యక్తిగత ఫేసుబుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ చాటింగులను ఎవరూ చదవకుండా ఎథికల్ హ్యాకర్లు సోషల్ మీడియా సైట్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. ఇలా కోట్ల మంది వ్యక్తిగత విషయాలకు భద్రత కలిగించే ఎథికల్ హ్యాకర్ల వేతనం లక్షల్లో ఉంటుందని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.


కానీ, ఇది నేర్చుకోవడం అంత ఈజీ కాదు. వాస్తవానికి, కంప్యూటర్ రంగంలో తోపులమని చెప్పుకొనే వాళ్లు కూడా హ్యాకింగ్ నేర్చుకుందామని ప్రయత్నించి.. వారి వల్ల సాధ్యంకాక ఆరంభంలోనే వదిలేస్తుంటారు.
అటువంటి అంతుపట్టని హ్యాకింగ్ విద్యపై 23 ఏళ్లలోనే పట్టుసాధించి నెలకు రూ. 7 లక్షల 50 వేలు అంటే సంవత్సరానికి 90 లక్షలు సంపాదించడమనేది మాములు విషయం కాదు.


వివరాల్లోకి వెళితే, ఉత్తర భారతదేశానికి చెందిన ఎథికల్ హ్యాకర్ శివమ్ వశిష్ట్(23) శాన్ ఫ్రాన్సిస్కో కు సంబంధించిన 'HackerOne' అనే ఒక వ్యవస్థతో కలిసి పనిచేస్తాడు. ఈ వ్యవస్థ సేవలను ట్విట్టర్, స్టార్ బక్స్ , ఇంస్టాగ్రామ్, గోల్డ్మన్ సాచ్స్, జొమాటో, వన్ ప్లస్ లాంటి ప్రముఖ సంస్థలు వినియోగించుకుంటున్నాయి. అయితే ఆ ప్రముఖ సంస్థల వెబ్సైటులలో ఉన్న సాంకేతిక సమస్యలను/లోపాలను గుర్తించి ఆధారాలతో ఆయా సంస్థలకు పంపిస్తే వారు లక్షలలోనే నజరానాని ప్రకటిస్తారు. ఇలా సాంకేతిక సమస్యలను గుర్తించడాన్నే.. బగ్‌ బౌంటీ అని అంటారు.


అయితే, ఈ ఏడాది మొత్తంలో కీలకమైన బగ్స్/దోషాలను కనిపెట్టి.. వాటికి పరిష్కారం చూపినందుకుగానూ శివమ్ వశిష్ట్ కు 125,000 డాలర్లని(దాదాపు రూ.90కోట్లు) ఆయా సంస్థలు ఇచ్చాయి. 19 ఏళ్ల వయసులోనే ఎథికల్ హాకింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన శివమ్.. తన 20ఏళ్ల వయసులో ఇన్స్టాకర్ట్, మాస్టర్ కార్డు వెబ్సైటులలోని లోపాలను గుర్తించి ఆ సంస్థలకి తెలియబరిచాడు. దాంతో ఆ రెండు సంస్థలు అతనికి కొంత డబ్బుని బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నడంతో తండ్రి జాబ్ నుంచి రిటైర్ అయ్యారు. వశిష్ట్ తన తమ్ముడికి కూడా హ్యాకింగ్ పాఠాలు నేర్పుతున్నాడు. ఏదేమైనా, అంతర్జాతీయ సంస్థలకు భద్రత కలిగించేత స్థాయికి ఎదిగిన వారిలో మన భారతీయుడు ఉండటం మనం గర్వించదగ్గ విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: