ప్రస్తుత రోజులలో  చాలా మంది క్విజ్‌లను ఆడటానికి, సోషల్ మీడియాలో కొనుగోలు చేయడానికి ఫేస్‌బుక్ లేదా గూగుల్ ఖాతాను వాడుతూ ఉంటారు. ఇలా చేసే తప్పుడు చాలా మంది గూగుల్, ఫేస్‌బుక్ వంటి వాటితో మూడవ పార్టీలోకి లాగిన్ అవుతూ ఉండడం సహజం. ఈ తరుణంలో భద్రత అనేది చాలా ఇబ్బంది కరంగా మారడం జరిగింది.  ఇలా చేసిన అప్పటి నుండి మూడవ పక్ష అనువర్తనాలకు మీ వ్యక్తిగత డేటాను దోచుకునే అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. ఇలా గూగుల్,  ఫేస్‌బుక్  ఖాతా నుండి మూడవ పార్టీ అనువర్తన ప్రాప్యతను కనుగొని తొలగించుకోవడం చాలా మంచిది అని నిపుణులు తెలియ చేయడం జరిగింది. 

 

ఇక  మూడవ  పార్టీ యాప్స్ గూగుల్ నుంచి తీయడం ఎలా  తెలుసుకోవాలో తెలుసు కుందమ్మా మరి...

 

మొదట మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో  సెట్టింగ్స్  ఓపెన్ చేయాలి. ఆ సెట్టింగ్స్ లో  కనిపించే గూగుల్ మెనూ నావిగేట్ చేయండి.
ఈ తర్వాత అకౌంట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, వెంటనే మీకు Apps Connectedలోకి మారండి అని చూపిస్తుంది.

 

ఆ తర్వాత  మీరు ఏయే అకౌంట్లకి కనెక్ట్ అయ్యారో మీకు చూపించడం జరుగితుంది. ఇలా చూపించిన దానిని మీరు రిమూవ్ చేయండి. అక్కడ కనిపించే ధర్డ్ పార్టీ యాప్ ని క్లిక్ చేస్తే Disconnect  అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు సులువుగా మూడవ  పార్టీ యాప్స్ ని తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో మీకు సమస్యలు ఎదురైతే వెంటనే మీ స్మార్ట్ ఫోన్ నుండి web browser ఓపెన్ చేయాలి. అక్కడ మీకు Remove Access అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

 


ఇలాగే ధర్డ్ పార్టీ యాప్స్ ఫేస్ బుక్ నుండి తీయడం కూడా తెలుసు కుందమ్మా మరి...

 

ముందుగా మీ ఫేస్ బుక్ లో  సెట్టింగ్స్  అండ్  ప్రైవసీ ని ఓపెన్ చేయాలి. అక్కడ సెట్టింగ్స్ ని  ట్యా చేయండి. ఆ తర్వాత కనిపించే అప్స్  , వెబ్సైట్ అన్ని  క్లిక్ చేయండి. అక్కడ మీకు Logged  ఇన్  విత్  ఫేస్బుక్ "అనే ఆప్సన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత  మీరు మీ సైన్-ఇన్ పద్దతిలో ఫేస్సుకు ఉపయోగించిన అన్ని అనువర్తనాలు మరియు వెబ్ సైట్ లను మీకు చూపిస్తుంది. ఇక   మీ ఫేస్బుక్ ఖాతా నుండి ప్రాప్యతను తొలగించు కోవడానికి  "తొలగించు" అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 


ఇంకా ఎందుకు ఆలస్యం ఇలా చేసుకొని మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: