చాలామందికి స్మార్ట్‌ఫోన్ అనేది ప్రపంచాన్ని చూపించే ఒక ద్వారం లాంటిది. మరి, ఆ ఫోనే మీ వ్యక్తిగత జీవితంలోకి పరాయి వ్యక్తులు తొంగిచూసేందుకు ఆధారంగా మారితే? చాలా క‌ష్టం క‌దా. హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం విప‌రీతంగా వింటున్న పదమిది. రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడి వారి విలువయిన సమాచారాన్ని తస్కరించడమే హ్యాకింగ్. ప్రపంచంలో ఎక్కడో వారు ఉంటూ ఇండియాలోని ప్రముఖ సంస్థలను హ్యాక్ చేస్తున్నారు. అలాగే అధికారులకు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్లలో మొత్తాన్ని లాగేసుకుంటున్నారు.

 

ఇక ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. అలాగే బ్యాంకింగ్, పాస్‌వర్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇలా అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌లోనే సేవ్ చేసుకునే రోజులివి. అందుకే ఫోన్ హ్యక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మ‌రి ఫోన్ హ్యక్‌ అయిందో కూడా తెలుసుకోవటం ముఖ్యం. ముఖ్యంగా మనతో సంబంధం లేకుండా ఫోన్ వేడేక్కటం, ఫోన్ బ్యాటరీ వరుసగా తగ్గిపోతున్నా, మనం ఇన్‌స్టాల్ చేయకుండా కొత్త యాప్స్ ఉండటం, ఫోన్ స్విచ్చాఫ్ చేయడానికి ప్రయత్నిస్తే కాకపోతే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. 

 

అలాగే మన కాల్స్ మనతో సంబంధం లేకుండా ఫోన్స్ వెళ్లటం, స్పై అనే పదంతో ఎలాంటి ఫైల్స్ ఫోన్‌లో కనపడ్డా… ఫోన్ హ్యక్ అయినట్లు అర్థం. మ‌రి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే.. మనం అవసరం లేని యాప్స్, మనకు తెలియకుండానే వచ్చిన యాప్స్‌ను ముందుగా డిలీడ్ చేయండి. అంతేకాదు ఫోన్ ద్వారా చేసే బ్యాంక్ ట్రాన్జక్షన్స్‌ను ఫ్రీ వైఫై జోన్ నుండి కాకుండా మొబైల్ డేటా నుండే చేయటమే బెటర్. మ‌రియు పాస్‌వర్డ్స్‌ను రిమెంబర్‌ ఆప్షన్‌ను ఎప్పుడూ ఎంచుకోకండి. ఆన్‌లైన్‌ లింక్స్‌ సహయంతో కాకుండా ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఉండే అప్‌డేట్ బటన్ ద్వారానే అప్డేట్ చేయటం ఉత్త‌మం.

మరింత సమాచారం తెలుసుకోండి: