ఆధార్.. దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి దాదాపు ఉన్న కార్డు ఇది. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎన్ని ఉపయోగాలు చెప్పక్కర్లేదు. బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా.. ఎక్కడైనా.. ఠక్కున గుర్తించవచ్చు. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని బట్టి తీర ప్రాంతాలకు అపరిచితులు ఎవరు వచ్చినా వెంటనే పసిగట్టే అవకాశం ఉంటుంది.  అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతూనే ఉన్నాయి. 

 

ఇదిలా ఉంటే.. ఆధార్ కార్డు ఉన్నవారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. 'ఆస్క్ ఆధార్' పేరుతో సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆస్క్ ఆధార్ అంటే ఆధార్‌ను అడగండి అని అర్థం. ఇది యూఐడీఏఐ ఛాట్‌బాట్ సర్వీస్. అంటే మీకు ఆధార్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏవైనా ఉంటే ఛాట్‌బాట్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ సమస్యల్ని ఛాటింగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేస్తే ఛాట్‌బాట్ ఐకాన్ కనిపిస్తుంది.

 

 ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి మీ సమస్య వివరించొచ్చు. ఆధార్ అప్‌డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్‌లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఇలా ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఆధార్‌కు సంబంధించిన వీడియోలు, సంబంధిత టాపిక్స్ కూడా అదే విండోలో చూడొచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: