ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌ వైపు చూస్తున్నాయి. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని ఇస్రో  కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 

 

తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించడంలో ఇస్రో ముందుంది. దీంతో ఇప్పుడు ఇస్రో వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలు నింగిలోకి పంపి ఐదేళ్లలో 1245 కోట్ల ఆదాయం గడించిన ఇస్రో మరింత జోరుగా తన విదేశీ వాణిజ్యాన్ని పెంపొదించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం పీఎస్ ఎల్వీ కంటే మరింత చిన్నవైన వాహక నౌకలను తయారు 
చేయడానికి సిద్దమవుతుంది.

 

విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహ ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992 లో ఏర్పాటైన ఈ సంస్థ  గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా  6 వేల 2 వందల ఎనబై 80 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎల్ ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. గత నెలలోనే పీఎస్ ఎల్వీ ఎక్స్ ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపేదుకు సిద్దంగా ఉన్నట్లు ఇస్రో చైర్మన్‌  కె.శివన్‌ తెలిపారు.

 

తక్కువ బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో పీఎస్ ఎల్వీ వాహక నౌకను సిద్దం చేస్తుంది. కేవలం 30 కోట్ల ఖర్చుతో 15 రోజుల్లో సిద్దం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఇస్రో. ఇప్పటికే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి విదేశీ ప్రైవేటు సంస్థలు రెఢీగా ఉన్నాయి. మరోవైపు అమెరికా ఇప్పటికే అతి తక్కువ బరువుగల రాకెట్‌ను తయారు చేసి న్యూజిలాండ్‌కు అందించింది. ఇక చైనా కూడా అదే దారిలో చిన్న రాకెట్లను తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఇస్రో కూడా విదేశీ మార్కెట్ పై దృష్టి పెట్టింది. మొత్తం మీద 2 శాతం ఉన్న విదేశి మార్కెట్‌ని 30 శాతం పెంచడానికి ఇస్రో కృషి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: