వాట్సాప్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది 2020 జ‌న‌వ‌రి 1 అంటే రేపేటి నుంచే వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. వాస్త‌వానికి ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేకుండా జనాలు ఉండలేకున్నారు. అంతలా ఈ మెసేజింగ్ యాప్ జీవితాలతో పెనేసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ ఇది. అయితే జనవరి 1 నుంచి కొన్ని ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు. మరి ఆ ఫోన్లు ఏవో, అందులో మీ ఫోన్ ఉందో లేదో తెలుసుకోండి.

 

 వాట్సాప్‌ రేపటి నుంచి విండోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లలో పనిచేయదు. ఇప్పటికే వాట్సాప్‌ పలుమార్లు ఈ విషయంపై ప్రకటనలు చేసిన నేపథ్యంలో రేపటి నుంచి విండోస్‌ మొబైల్‌ ఓఎస్‌ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని ఆ సంస్థ మరోసారి వెల్లడించింది. ఇక మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి వాట్సాప్‌ యాప్‌ను తొలగించనున్నట్లు కూడా వాట్సాప్‌ తెలిపింది. అలాగే 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐఓఎస్‌ 8 , ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌లు, అంతకు ముందు వచ్చిన ఓఎస్‌లు ఉన్న ఫోన్లలోనూ వాట్సాప్‌ పనిచేయదని ఆ సంస్థ వెల్ల‌డించింది.

 

 ఒకసారి మీ ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉందో చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మీ ఫోన్‌లో వాట్సప్ పనిచేయదు. అలాగే ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఓఎస్ ఉన్నా ఇదే పరిస్థితి.  ఇక 2019 డిసెంబర్ 31 నుంచి అన్ని విండోస్ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ ఫోన్లు వాడుతున్నవాళ్లు వెంటనే తమ డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది. కాగా ఇలాంటి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నది వాట్సప్ తెలిపింది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: