స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లంద‌రికీ వాట్సాప్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప్రతి ఒక్కరూ రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో దూసుక‌పోతుంది. అయితే  వాట్సాప్ లో అందరికీ తెలియని ఫీచర్స్, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం ద్వారా మనం వాట్సాప్ వాడకాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు. ఇక  ఇటీవల పెగసస్ స్పైవేర్ ఎటాక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ప్రైవసీ సమస్యలెన్నో వాట్సప్ యూజర్లకు ఉన్నాయి. అయితే మీరు ప్రైవసీ సెక్షన్‌లో సెట్టింగ్స్‌ మారిస్తే మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.

 

మీ వాట్సప్‌లో ప్రైవసీలోకి వెళ్తే చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని మార్చుకోవడం ద్వారా మీ వాట్సప్‌ని సురక్షితంగా ఉంచే బెనిఫిట్ పొంద‌వ‌చ్చు. దీని కోసం ముఖ్యంగా.. ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని రిలీజ్ చేసింది వాట్సప్. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ సెలెక్ట్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి. అలాగే మీరు పంపిన మెసేజ్‌ని అవతలివాళ్లు చూశారో లేదో తెలుసుకునేందుకు బ్లూ టిక్స్ ఉపయోగపడతాయి. అయితే మీరు మెసేజ్ చూసినట్టు అవతలి వ్యక్తులకు తెలియకూడదంటే మీరు బ్లూ టిక్స్ ఆఫ్ చేయొచ్చు.

 

సెట్టింగ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రైవసీలో రీడ్ రిసిప్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. ఇక మీ వాట్సప్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నందున మీరు పంపిన టెక్స్‌ట్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు ఇతరులెవరూ యాక్సెస్ చేయలేరని చెబుతోంది వాట్సప్.  వాట్సప్ గ్రూప్స్ కూడా ఓ పెద్ద సమస్యే. మీ కాంటాక్ట్ నెంబర్ ఉన్నవాళ్లంతా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తుంటారు. అందుకే ఎవరు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌లో ప్రైవసీలో గ్రూప్స్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్క‌డ నాలుగు ఆప్ష‌న్స్‌లో మీకు న‌చ్చింది క్లిక్ చేస్తే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: