స్మార్ట్ ఫోన్ ప్రియుల‌కు శుభ‌వార్త‌. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే మీకు సరైన అవకాశం. ఎందుకంటే నోకియా సంస్థ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా దిగివచ్చాయి.  ఇటీవలే మార్కెట్లో పోటీకి అనుగుణంగా రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసిన నోకియా, ఎలాగైనా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం బలంగా చేస్తోంది. ఇక యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఈ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

 

ముఖ్యంగా మన దేశ మార్కెట్‌లో నోకియా ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఈ ఫోన్‌ 6,975 రూపాయలకు లభ్యమవుతోంది. ఆరంభ ధరతో పోలిస్తే ఇది 36 శాతం తక్కువ. నోకియా బ్రాండ్‌ ఫోన్ల విక్రయ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌.. ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ను గత మే నెలలో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అప్పుడు ఈ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.10,990 కాగా తర్వాత రూ.9,499కు తగ్గించారు. ఆరంభ ధర కంటే ఇప్పుడు బాగా తగ్గింది. 

 

ఈ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లో 5.71 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సల్‌ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజీ, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్‌, క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగెన్‌ 439 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, బ్లూటూత్ 4.2, డ్యుయ‌ల్ సిమ్‌3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. కాగా, మే 7న కొత్త నోకియా 4.2 స్మార్ట్‌‌ఫోన్‌లో భార‌త మార్కెట్‌లోకి విడుదల చేసింది.

 

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: