మన చుట్టూ రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ర‌క‌ర‌కాల రూపాల్లో అనేక మోసాలు న‌గ‌ర‌వాసుల‌ను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కొత్త కొత్త అవ‌తారాల్లో జ‌నాన్ని మోసం చేసేందుకు మోస‌గాళ్లు చిత్ర విచిత్ర వేశాలు వేస్తున్నారు. ఒక మోసం ఆట‌క‌ట్టించారు అనుకునే లోపు మ‌రో కొత్త త‌ర‌హా మోసం వెలుగులోకి వ‌స్తోంది. అలాగే పెరుగుతున్న టాక్నాలిజీతో సైడ‌ర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, డెబిల్ కార్డులు మోసాగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత‌ అప్ర‌మ‌త్తంగా ఉన్నా అక్క‌డోక‌క్క‌డ‌.. ఎవ‌రో ఒక‌రు మోస‌పోతూనే ఉన్నారు.

 

ఇక మీ స్మార్ట్‌ఫోన్ చాలా సేఫ్ అని మీరు అనుకున్నా ఏదో ఓ రూపంలో ముప్పు పొంచుకొస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మాల్‌వేర్ ఎటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటి యాప్స్‌ని గుర్తించి గూగుల్ నిత్యం తొలగిస్తూనే ఉన్నా కొత్తకొత్త యాప్స్‌లో మాల్‌వేర్ బయటపడుతోంది. ఈ క్ర‌మంలోనే ai.type కీబోర్డ్ యాప్ యూజర్లను కలకలం రేపింది. మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్‌స్ట్రీమ్‌కు చెందిన పరిశోధకులు ai.type కీబోర్డ్ యాప్‌ యూజర్లను దోచుకున్నట్టు బయటపెట్టారు. ఈ యాప్ కీబోర్డ్ ఉపయోగించే యూజర్ల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. 

 

యూజర్ల ప్రమేయం లేకుండా ప్రీమియం థర్డ్ పార్టీ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్టే తేలింది. అంటే.. మీరు ఈ కీబోర్డ్ యాప్ వాడుతున్నట్టైతే మీకు తెలియకుండా మీ అకౌంట్ల నుంచి పేమెంట్స్ జరిగిపోతుంటాయి. సో.. ఇలాంటి గ‌నుక మీ ఫోన్ ఉంటే వెంట‌నే డిలీజ్ చేయండి. కాగా, ఇప్పటివరకు 1.4 కోట్ల పేమెంట్ రిక్వెస్ట్‌లు వెళ్లినట్టు అప్‌స్ట్రీమ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వాస్తవానికి ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి 2019 జూన్‌లోనే గూగుల్ తొలగించినా అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవారు చిక్కుల్లో ఉన్నట్టే మ‌రి. అంద‌కే బీ కేర్ పుల్‌..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: