సాధార‌ణంగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడు కూడా మార్కెట్‌లోకి ఏ కొత్త స్మార్ట్‌ఫోన్ వ‌స్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే అలాంటి వారంద‌రికీ శుభ‌వార్త‌. కొత్త స్మార్ట్ ఫోన్  కొనాలనుకునేవారికి ఇదే స‌రైన స‌మ‌యం. ఎందుకంటే అదిరిపోయే ఫీచర్లతో వివో ఎస్1 ప్రో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. జనవరి 4న అంటే నేడేనండోయ్‌.. వివో ఆక‌ర్షించే ఫీచ‌ర్ల‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌ చేయనుంది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ ఏడాది వివో రిలీజ్ చేస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. 

 

కొంతకాలంగా వివో ఎస్1 ప్రో మోడల్‌ను బాగా ప్రమోట్ చేస్తోంది వివో. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ విశేషం. ఇప్పటికే వివో ఎస్1 ప్రో ఫిలిప్పీన్స్‌లో రిలీజైంది. స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. సూపర్ అమొలెడ్ డిస్‌‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్ ఉండటం విశేషం.

 

ఇక వివో ఎస్1 ప్రో స్పెసిఫికేషన్స్ విష‌యానికి వ‌స్తే.. 6.38 సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ర్యామ్: 6జీబీ, 8జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665, రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్, కలర్స్: క్రిస్టల్ బ్లూ, డ్రీమీ వైట్, నైట్ బ్లాక్ ఫీచ‌ర్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ధర: సుమారు రూ.19,990 ఖ‌రారు చేస‌న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: