ఎప్పుడైతే టెలిఫోన్ రంగంలో రిలయన్స్ జియో అడుగు పెట్టడం జరిగిందో మిగతా నెట్వర్క్ లన్నీ పడిపోయాయి. అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తూ నెట్వర్క్ రంగంలో దూసుకుపోతున్న జియో తాజాగా ప్రజెంట్ ఉన్న ఏ నెట్వర్క్ ఇవ్వని బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో వినియోగదారులకు ఇటీవల కాలంలో వూట్, హాట్ స్టార్, కొన్ని ఇతర యాప్స్ కు సంబంధించిన సబ్ స్క్రిప్షన్ ను ఈ మధ్యనే జియో తన వినియోగదారులకు అందించింది. తాజాగా ఈ జాబితాలో జీ5 కూడా చేరింది. అవును.. జీ5కు చెందిన సబ్ స్క్రిప్షన్ ను కూడా జియో ఫైబర్ తన వినియోగదారులకు అందించడం ప్రారంభించింది.

 

జీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు సంబంధించిన ఓటీటీ యాపే ఈ జీ5. ఈ ఒక్క యాప్ సబ్ స్క్రిప్షన్ వల్ల దేశవ్యాప్తంగా జి నెట్వర్క్ ద్వారా ప్రసారం అయ్యే కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్ సబ్ స్క్రిప్షన్ నెలవారి చార్జీలు 99 రూపాయలు గాను వార్షిక చార్జీలు 999 రూపాయలు గా అందుబాటులోకి జియో తీసుకురావడం జరిగింది. ఇప్పటికే జియో ఓటీటీ యాప్స్ ను జియో ఫైబర్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

 

అయితే ఈ ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్ ను పొందాలంటే.. మీరు కనీసం రూ.849 ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అయితే ఈ ప్లాన్ ద్వారా కేవలం మూడు సార్లు మాత్రమే ఈ లాభాలను పొందగలరు. వీటిని పూర్తిస్థాయిలో పొందాలంటే మాత్రం రూ.1,299 గోల్డ్ ప్లాన్ లేదా దాని కంటే పై ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో తాజాగా రిలయన్స్ జియో ప్రకటించిన కొత్త బంపర్ ఆఫర్ వల్ల వినియోగదారులకు చాలా తక్కువ ఖర్చుతో జీ5 యాప్ ద్వారా అన్ని వినోద కార్యక్రమాలను చూసుకునే అవకాశం వినియోగదారులకు కలిగించేలా చేసింది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: