జియో వినియోగదారులు 51రోజుల పాటు డైలీ 2జిబి డేటా ని పొందాలంటే.. రూ.444 ప్లాన్ తో రీఛార్జ్ చేయించాలి. అయితే, ప్రస్తుతం కేవలం 251 రూపాయలకే జియో 51రోజుల పాటు 2జీబీని అందించబోతుంది. కానీ, ఈ రీఛార్జ్ వౌచెర్ తో కేవలం డేటా మాత్రమే వస్తుంది. కాల్స్, ఎస్ఏంఎస్ లు రావు. అయితే, మిగతా ప్లాన్స్ తో సంబంధం లేకుండా 51రోజుల పాటు నిరంతరాయంగా రోజుకి 2జీబీ చొప్పున డేటాని వినియోగించవచ్చు.



ఒకవేళ, మీకు ఎక్కువ డేటా తో పాటు కాల్స్ కావాలి అనుకుంటే.. ఈ కింది విధంగా చేయండి..!!

మీరు రూ.149తో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి.. దాంతో పాటు రూ.251తో రీఛార్జ్ చేస్తే.. అప్పుడు మీకు 24రోజుల పాటు 1జీబీ డేటా+2జీబీ అంటే టోటల్ గా రోజుకి 3జీబీ డేటాను పొందవచ్చు. 24రోజులు గడిచిపోయిన తరువాత మళ్ళీ 149తో రీఛార్జ్ చేయిస్తే అప్పుడు మళ్ళీ ఇంకొక 24రోజుల పాటు డైలీ 3జీబీ డేటా ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం కలిపి 48రోజులకు 549రూపాయలు వెచ్చిస్తే/చెల్లిస్తే మీకు డైలీ 3జీబీ డేటా తో సహా జియో అపరిమిత కాల్స్, 600నిముషాల ఇతర నెట్వర్క్ కాల్స్, 100ఎస్ఏంఎస్ లు వస్తాయి. అదే మీరు డైరెక్ట్ గా ఆల్ ఇన్ వన్ ప్లాన్ ₹.444తో రీఛార్జ్ చేయిస్తే 56రోజుల పాటు డైలీ కేవలం 2జీబీ మాత్రమే లభిస్తుంది. అంటే 100రూపాయలను ఎక్కువగా చెలిస్తే 48జీబీ ఎక్సట్రాగా లభిస్తుందన్న మాట. అంటే 2రూపాయలకు 1జీబీ పొందవచ్చు. ఇదే తరహాలో 399 రూపాయలు పెట్టి రీచార్జ్ చూపిస్తేే ఇంకా ఎక్కువ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్్ డేటా ను ఎక్కవగా వాడే వారికి బాగా ఉపయోగపడుతుందని జియో చెబుతుంది. నెట్ ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్, ఇంకా మొబైల్ హాట్ స్పాట్ ని వినియోగించి టీవీ లో మూవీస్ చూసేవారికి బాగా యూజ్ అవుతుంది ఈ ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: