దేశీయ టెలికాం రంగంలో రోజురొజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మ‌రో అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో దెబ్బతో ఇతర టెలికాం సంస్థలు కూడా డేటా టారిఫ్‌లను తగ్గించి కస్టమర్లకు ఉపశమనం కల్గించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా  వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

 

భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేస్తుంది.  కొన్ని నెలలుగా వైఫై ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునే ఫీచర్‌ని పరీక్షిస్తోంది రిలయెన్స్ జియో. జనవరి 8న దేశవ్యాప్తంగా ఈ సర్వీస్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. అయితే ఇక కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు.

 

ఇండియాలో జనవరి 7 నుంచి 16 మధ్య జియో వైఫై కాలింగ్ అందుబాటులోకి వస్తుంది. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌కి సులువుగా మారొచ్చు.  మ‌రి మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే ఈ సర్వీస్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే మీ ఫోన్‌కు వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు Jio.com/wificalling వెబ్‌సైట్‌ చూడొచ్చు. కాగా, కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నందున వాయిస్ కాలింగ్ అనుభవాన్ని పెంపొందించేందుకు జియో వైఫై కాలింగ్ సర్వీస్‌ని ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: