ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్‌లో సులువుగా మారింది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచిన అనేక ఫీచర్లు యాప్ వినియోగాన్ని మరింతగా రెట్టింపు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే..  డ్యుయల్‌ సిమ్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను వినియోగించుకుంటోన్న చాలా మంది యూజర్లకు తమ డివైస్‌లోని రెండు నెంబర్లకు వేరువేరు వాట్సాప్‌ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక ఉంటుంది.

 

కానీ వాట్సాప్‌ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన మొబైల్‌ డివైస్‌లో ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్ని ట్రిక్స్‌ను ఫాలో చేయటం ద్వారా ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌ అకౌంట్‌లను నిర్వహించుకునేందుకు సాధ్యమవుతుంది. అందుకు ముందుగా  ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోని యాప్స్‌‌లోకి వెళ్లాలి. అక్కడ డ్యూయెల్ యాప్/క్లోన్ యాప్/యాప్ ట్విన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి. అందులో వాట్సాప్ ఎంచుకోండి. దీంతో ఫోన్ యాప్స్‌లో రెండు వాట్సాప్‌లు కనిపిస్తాయి. 

 

ఇప్పుడు ఇంకొక నెంబర్‌పై రెండో అకౌంట్‌ కూడా క్రియేట్ చేసుకోండి. అయితే ఒకవేళ మీ ఫోన్‌లో డ్యూయెల్ ఉంటే ఓకే లేకపోతే మాత్రం పారలెల్ స్పేస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. వాట్సాప్ ఒక్కటే కాదు.. ఫేస్‌బుక్, మెసేంజర్ వంటి యాప్స్‌ కూడా క్లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ద్వారా ఒకే ఫోన్‌లో రెండు అకౌంట్లు ఈజీగా వినియోగించుకోవచ్చు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మనం చాలా సులభంగా మన అకౌంట్లను ఈజీగా వాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: