టిక్ టాక్.. ఓ యాప్.. సింపుల్­గా యాప్ అనడం కంటే ఇదొక వ్యసనం అనొచ్చు. అంతగా టిక్ టాక్ యూజర్లను మైకంలో ముంచేస్తోంది. ఇప్పుడు ఎవరైనా గంటలు గంటలు ఒంటరిగా గడిపేస్తున్నారంటే.. టిక్ టాక్­లో దూరిపొయ్యారని అర్థం చేసుకోవాలి. ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 30 కోట్ల మందికి పైగా టిక్ టాక్ వాడుతున్నారు. అందులో వచ్చే 15 సెకండ్ల షార్ట్ వీడియో మెసేజ్‌లను చూస్తూ ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఓ వైపు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా.. ఉద్యోగాలు పోతున్నా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సరదాగా వీడియోలు చేసి.. టిక్‌ టాక్‌లో పెట్టి.. కెరీర్‌తో సహా లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తున్నారు.

 

సాధార‌ణంగా కొంద‌రికి టిక్ టాక్ ఎలా వాడాలో కూడా తెలియ‌దు. అయితే పిల్లలు తల్లిదండ్రుల మొబైళ్లలో టిక్ టాక్‌ను ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. ఆ విషయం తెలియని పేరెంట్స్ దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలాంటి లూప్‌హోల్స్‌ని గుర్తించిన హ్యాకర్లు టిక్ టాక్‍‌ ద్వారా ఓ బగ్‌ని ఎంటర్ చేశారు. అది ఇప్పుడు చాలా మంది టిక్ టాక్ యాప్స్‌లో చేరింది. అక్కడి నుంచీ మొబైళ్లలో తిష్టవేసి వాళ్ల కాంటాక్ట్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఫొటోలూ, లాగిన్ ఐడీలు, వీడియోలూ అన్నింటినీ హ్యాకర్లకు చేరవేస్తున్నాయి. ముఖ్యంగా ఈ బగ్ ద్వారా అమ్మాయిలు తీసుకునే సెల్ఫీలను హ్యాకర్లు దొగిలిస్తున్నారు. 

 

వాటిని మార్ఫింగ్ చేసి నగ్నంగా చూపిస్తూ.. పోర్న్ వెబ్‌సైట్లకు ఆ ఫొటోలను అమ్ముకుంటున్నారు. ఇలా చాలా మంది పోర్న్ ప్రపంచంతో సంబంధం లేని అమ్మాయిల ఫొటోలు ఆ సైట్లలో దర్శనమిస్తున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికీ చాలా టిక్ టాక్ అకౌంట్లలో ఆ బగ్ అలాగే ఉంది. ఇందుకు కారణం  వాళ్లెవరూ యాప్‌ని అప్ డేట్ చెయ్యకపోవడం, రీలాగిన్ అవ్వకపోవడమే. అందువల్ల టిక్ టాక్ యాజమాన్యం యాప్ వాడుతున్న ప్రతి ఒక్కర్నీ యాప్ అప్‌డేట్ చేసుకోమని కోరుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: