కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే స‌రైన స‌మ‌యం. అతి త‌క్కువ ధ‌ర‌కే అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో అంద‌మైన స్మార్ట్‌ఫోన్స్ మీ కోస‌మే ఎదురుచూస్తున్నాయి. మ‌రి వాటిపై ఓ లుక్కేస్తేపోలా. కేవ‌లం రూ.7,500 లోపు మంచి స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముందుగా..  గతేడాది రియల్‌మీ లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్లల్లో ఒకటి రియల్‌మీ 3. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3డీ గ్రేడియంట్ డిజైన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.2 అంగుళాలు డిస్‌ప్లే ఉంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. బ్యాటరీ 4230 ఎంఏహెచ్.

 

అలాగే రియల్‌మీ 3 మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక‌ డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రిలీజ్ చేసినప్పుడు రూ.8,999 కాగా, ప్రస్తుతం రూ.7,499 ధరకే కొనొచ్చు. మ‌రియు మోటోరోలా అతి తక్కువ ధరలో రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ మోటో ఈ6ఎస్. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 

 

ఇక మోటో ఈ6ఎస్ డ్యూయెల్ సిమ్ సపోర్ట్, కెమెరా 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, బ్యాటరీ 3000 ఎంఏహెచ్ ఉన్నాయి. ఈ ఫోన్ రిలీజ్ చేసినప్పుడు మోటో ఈ6ఎస్ 4జీబీ+64జీబీ ధర రూ.7,999. కానీ ప్రస్తుతం రూ.6,999 ధరకే కొనొచ్చు. అలాగే నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్.. సిఫికేషన్స్ చూస్తే 5.7 అంగుళాల హెచ్‌డీ+ 1520x720 పిక్సెల్స్ డిస్‌ప్లే ఉంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. నోకియా 4.2 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 3జీబీ+32జీబీ ధర రూ.6,899 పొందొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: