జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లాన్స్ తీసుకొచ్చి అందరిని సంతోష పెడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ మూడు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. 

 

అయితే ఇప్పటికే వైఫై కాలింగ్.. జియో ఫైబర్..  సెట్ టాప్ బాక్స్ ఇలా అన్నిటి ద్వారా జీ5, హాట్ స్టార్ సహా ఐదు ఓటీటీ సర్వీసులను అందిస్తూన్నా జియో ఇప్పుడు ఆ జాబితాలో మరో సం నెక్స్ట్ కూడా చేర్చింది. సన్ నెట్వర్క్ సంబంధించిన జెమినీ టీవీ వంటి తెలుగు ఛానెల్ తమిళం జెమినీ టీవిలో వచ్చే కార్యక్రమాలన్నీ ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా చూసుకోవచ్చు.

 

ఇప్పటికే జియో ఫైబర్ తన ఓటీటీ యాప్స్ జాబితాలో జీ5ను చేర్చింది. దేశవ్యాప్తంగా జీ నెట్ వర్క్ కు ఉన్న అన్ని చానెల్స్ కార్యక్రమాలు ఈ యాప్ లో వస్తాయి. అయితే అవి మాత్రమే కాదు జియో యాప్ కోసం జీ నెట్వర్క్ ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తుంది. ఆ కార్యక్రమాలు అన్నినింటిని జియో ఫైబర్ వినియోగదారులు ఫ్రీగా చూడచ్చు. 

 

అంతేకాదు జియో ఫైబర్ వినియోగదారులు హాట్ స్టార్, జీ5, వూట్, సోనీ లైవ్, సన్ నెక్స్ట్ వంటి ఓటీటీ యాప్స్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అంటే ఒక్క ఈ జియో ఫైబర్ తో సంవత్సరానికి రూ.365 సబ్ స్క్రిప్షన్ ఫీజు కల హాట్ స్టార్ వీఐపీ, రూ.999 విలువైన జీ5, రూ.480 విలువైన సన్ నెక్స్ట్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులను ఈ జియో ఫైబర్ తో ఫ్రీ గా చూడచ్చు.

 

అయితే ఈ ఓటీటీ సర్వీసులు అన్ని కూడా సెట్ టాప్ బాక్స్ లో లభించే జియో టీవీ+ యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. కాగా ఈ సర్వీసులు అన్ని కావాలంటే మూడు నెలలకు గాను 849 రూపాయిలు చెల్లిస్తే చాలు. సరిపోతుంది. అదే 1,249 రూపాయిల రేచర్గే చేసుకుంటే మీరు ఈ ప్లాన్ ఎంతకాలం కొనసాగిస్తారా అంతకాలం పాటు ఉంటుంది. ఏది ఏమైనా అంబానీ ఇచ్చినట్టు మరొకరు ఇవ్వలేరు అబ్బా ఆఫర్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: