ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడ‌నివారు ఉండ‌డం లేదు. క‌నీసం ఇండికో స్మార్ట్‌ఫోన్ అయినా ఉంటుంది. మ‌న నిత్య అవ‌స‌రాల‌కు స్మార్ట్‌ఫోన్ ఓ ఆధారంగా మారింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ఇక‌ సాధార‌ణంగా ఏదైనా ప‌నిలో ఉన్న‌ప్పుడు వ‌చ్చే మెసేజ్‌ల‌తో చాలా మంది చిరెత్తిపోతారు. కానీ పైకి చెప్ప‌లేరు. ఏం చేస్తాం ఫోన్‌ను ఏమి అన‌లేం క‌దా. ఈ క్ర‌మంలోనే స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా ఉండటం, వాటి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడపాల్సి వస్తోంది. అయిటే అలా మెసేజ్‌లు, నోటిఫికేషన్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. 

 

స్మార్ట్‌ఫోన్‌ కాస్త ఎక్కువగా ఉపయోగించేవారికి రోజూ వెయ్యికి పైగా నోటిఫికేషన్స్ వస్తాయని అంచనా. అందులో వాట్సప్ మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, యాప్ నోటిఫికేషన్లు, పుష్ నోటిఫికేషన్స్, అలర్ట్స్ ఇలా అనేక ర‌కాల మెసేజ్‌లు విసికిస్తూ ఉంటాయి. ఎంత బిజీ పనుల్లో ఉన్నా, చివరకు హాలిడేస్‌లో, వెకేషన్‌లో ఉన్నా ఈ నోటిఫికేషన్ల సమస్య తప్పదు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ యాప్ రూపొందించింది. డిజిటల్ వెల్‌బీయింగ్‌లో భాగంగా 'పోస్ట్ బాక్స్' యాప్‌ను రూపొందించింది. 

 

ఈ యాప్ ఆన్ చేశారంటే... మీకు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్స్ అన్నీ పోస్ట్ బాక్స్‌లోకి వెళ్లిపోతాయి. మీరు సూచించిన సమయంలోనే అవి మీకు డెలివరీ అవుతాయి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోస్ట్ బాక్స్ యాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లు చూడొచ్చు. అంటే మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని డిస్‌ట్రాక్ట్ చేయొద్దు అనుకుంటే పోస్ట్ బాక్స్ యాప్ ఆన్ చేస్తే చాలు. మ‌న‌కు వ‌చ్చే మెసేజ్, నోటిఫికేషన్ అన్నీ పోస్ట్ బాక్స్‌‍లోకి వెళ్లిపోతాయి. ఆ త‌ర్వాత మ‌న‌కు తీరిక దొరికిన‌ప్పుడు అది చూసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: