ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అది లేనిది ఎవరికీ రోజు కూడా గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌తోనే అనేక పనులను ఇంటి నుండే చేసేస్తున్నాం. ఇక ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఉన్న వాళ్లంద‌రూ వాట్సాప్ వాడుతుంటారు. వాట్సాప్ వాడ‌డం త‌ప్పుకు కాదు.. అందులో ఈ ప‌నులు చేస్తే ఇక అంతే సంగ‌తులు అనుకోవాలి. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. వాట్సాప్ మీరు తెలిసో, తెలియకో చేసే కొన్ని పనులు నేరుగా మిమ్మల్ని జైలుకి పంపించే అవకాశం ఉంది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల గురించి పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. అయితే మీ వాట్సాప్ లో ఈ ప‌నులు చేస్తే మాత్రం మీరు జైల్‌కే వెళ్లాలి.

 

వాట్సాప్ లో పోర్న్ క్లిప్ లను ఎక్కువగా షేర్ చేస్తున్నారా? అయితే మీరు జైల్‌కు వెళ్లే రోజులు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ట్టే. ఎందుకంటే దేశంలో జరుగుతున్న అత్యాచారాల్లో అధిక భాగం ఈ పోర్న్ కారణంగా జరుగుతున్నాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాబట్టి వాట్సాప్ లో పోర్న్ కు దూరంగా ఉండటం మంచిది. వాట్సాప్ లో మహిళలను ఇబ్బంది పెట్టేలా మెసేజ్ లు చేసినా మీరు కటకటాల్లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈ మధ్య ఇటువంటి విషయాల్లో వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. 

 

వాట్సాప్ లో ప్రముఖులకు సంబంధించిన మార్ఫ్ డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం కూడా శిక్షార్హమైన నేరం. ఎదుటివారి మతానికి, ప్రాంతానికి, నమ్మకాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మెసేజ్ లు పెట్టినా మీరు అరెస్టు కావడం ఖాయం. మరొకరి పేరుతో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేయడం, వారి లాగా చాట్ చేయడం కూడా నేరమే. ఇలా చేసిన వారికి కూడా కఠిన శిక్ష తప్పదు. నిషేధిత వస్తువుల అమ్మకాలను వాట్సాప్ ద్వారా అమ్మడం చట్టరీత్యా నేరం. ఉదాహరణకు డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువుల అమ్మకాలు జరిపితే.. పోలీసుల దృష్టి మీ మీద పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: