భారతదేశం అనగానే గుర్తొచ్చేది ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన, అతి ప్రాచీనమైన దేశం భారత దేశం. ఇక్కడ ఇప్పటికీ సంస్కృతీ సాంప్రదాయాలు విరాజిల్లుతున్నాయంటే అందుకు  కారణం హిందుత్వమే. హిందువుల గడ్డగా ఎంతో చరిత్ర గడించిన ఈ భారతావనిలో హిందూ దేవుళ్ళని మొక్కని వారంటూ ఉండరు. అలాంటి దేవుళ్ళని కాలి కింద వేసుకునే పట్టాలపై, డోర్ మ్యాట్ లపై ముద్రించింది అమెజాన్ సంస్థ..

Image result for #BoycottAmazon

అంతేకాదు తక్కువ ధరకే డోర్ మ్యాట్ లు అంటూ బాత్ రూమ్ లో , టాయిలెట్స్ లో హిందూ దేవుళ్ళ ఫోటోలతో కూడిన ఫోటోలు సైట్ లో ఉంచింది. అమెజాన్ హిందూ దేవుళ్ళ పై ఈ విధమైన పైత్యాన్ని ప్రదర్శించడంతో ప్రతీ భారతీయుడి రక్తం ఉడికి పోయింది. భారత వినియోగ దారులు అందరూ అమెజాన్ సంస్థపై ఆగ్రహాని ప్రదర్శించారు. దీనికి పర్యవసానం ఎలా ఉంటుందో చూద్దూగాని అంటూ ట్విట్టర్ లో బాయ్ కాట్ అమెజాన్ అంటూ నిరసనలు తెలుపుతున్నారు.

Image result for #BoycottAmazon

దాంతో ఒక్కసారిగా ట్విట్టర్ లో అత్యత్న ప్రాచుర్యం పొందింన  వార్తగా నిలిచింది. అమెజాన్ పై భారతీయులు అందరూ నిరసనలు తెలుపడంతో ఒక్క సారిగా షాక్ అయిన అమెజాన్ సంస్థ తమ సైట్ నుంచీ ఆ వస్తువులని తొలిగించింది. ఇదిలాఉంటే అమెజాన్ ఇలాంటి చేష్టలు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా అమెజాన్ హిందూ దేవుళ్ళని కించ పరిచేలా ఇలాంటి వస్తువులనే అమ్మకానికి పెట్టి అభ్యంతరాలు వెలువడుతున్న సమయంలో సైట్ నుంచీ తొలగించేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: