టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులతో టెలికో కంపెనీల్లో పోటీ వాతావరణం నెలకొంది. టెలికోలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లు, రీఛార్జ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడూ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మనదేశంలో టెలికాం ఆపరేటర్లు టారిఫ్ లు పెంచి నెల పైనే అవుతుంది. అయినప్పటికీ కొత్త ప్లాన్ల విషయంలో కొందరు గందరగోళానికి గురవుతున్నారు. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా.. మీరు ఉపయోగించేది ఏ నెట్ వర్క్ అయినా సరే.. మీరు రూ.450లోపు మంచి ప్లాన్ల కోసం చూస్తున్నట్లయితే ఇటు ఓ లుక్కేసేయండి.

 

రిలయన్స్ జియో తన రూ.444 ప్లాన్‌ను వినియోగదారుల కోసం వెల్లడించింది.  దీని ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటాను ఆస్వాదించగలుగుతారు. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 2,000 ఉచిత నిమిషాలను అందిస్తారు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వొడాఫోన్ ఐడియా ఇటీవలే తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.449 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. 

 

ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. వినియోగదారులకు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ రూ .449 ప్లాన్‌ తో రీచార్జ్ చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా వోడాఫోన్ ఐడియా మాదిరిగానే 56 రోజులుగా ఉంది. దీంతోపాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటాను ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ద్వారా తన వినియోగదారులకు అందిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: