మొబైల్స్ తయారీదారు మోటోరోలాకు చెందిన మోటోరోలా రేజర్ స్మార్ట్‌ఫోన్ ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మోటోరోలా నుంచి కొత్త ఫోన్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. మోటోరోలా రేజర్ మోడల్ పేరుతో దీన్ని రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే చైనా, ఇతర గ్లోబల్ దేశాల్లోని మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఫోల్డింగ్ డిస్ ప్లే ప్రత్యేక ఫీచర్. పదేళ్ల క్రితం ఫోల్డింగ్ డిస్ ప్లే తో మోటోరోలా స్మార్ట్ ఫోన్ వచ్చింది. అప్పట్లో బాగా అట్రాక్ట్ చేసింది. 

 

మళ్లీ అలాంటి ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నారు. దీని ధర 1500 డాలర్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాల లక్ష రూపాయలు. ఇక‌ త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కొత్త ఫోన్ పై మేడిన్ ఇండియా అనే ట్యాగ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీన్ని సగం వరకు మడతబెట్టవచ్చు. అలాగే క్విక్ వ్యూ కోసం 2.7 ఇంచుల మరో సెకండరీ డిస్‌ప్లేను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

 

ఇక స్పెసిఫికేష‌న్స్ చూస్తే.. మోటోరోలా రేజర్ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్  9.0 స్టాక్ ఓఎస్‌ను అందిస్తున్నారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 2510 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో కేవలం ఇ-సిమ్ కార్డులకు మాత్రమే సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0 ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: