ఆన్లైన్ లో షాపింగ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ప్రతీ పండుగరోజును పురస్కరించుకుని వినియోగదారులని అద్భుతమైన సేల్స్ తో ఆకట్టుకోవడంలో అమెజాన్ రూటే సపరేటు. ఈ సారి కూడా అమెజాన్ మరో భారీ బిగ్ సేల్ తో ముందుకు వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్ లు ఇస్తూ స్మార్ట్ ఫోన్ లపై భారీ ఆఫర్స్ అందిస్తోంది. ల్యాప్ టాప్ లు, స్మార్ట్ టీవీల పై సైతం భారీ ఆఫర్లు ఇస్తూ కస్టమర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 

ఈ ఆఫర్ జనవరి 19 న మొదలయ్యి, 22 ,2020 వరకూ కొనసాగుతుందని, అయితే అమెజాన్  ప్రైమ్ యూజర్స్ మాత్రం జనవరి 18 మధ్యాహ్నం నుంచే కొనుగులో చేసుకోవచ్చని ఓ ప్రకటన లో తెలిపింది. ఈ భారీ బిగ్ సేల్ లో అమెజాన్ స్మార్ట్ ఫోన్ లపై 40 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా, ఎలక్ట్రానిక్ వస్తువులపై సుమారు 60 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అమెజాన్ లో ఉన్న అన్ని మొబైల్ ఫోన్ లపై డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్ . ఇక మొబైల్ యాక్సిసిరీస్ పై కూడా భారీ డిస్కౌంట్ ఇస్తోంది.

 

ఈ బిగ్ సేల్ లో డిస్కౌంట్ మాత్రమే కాకుండా sbi క్రెడిట్ కార్డ్ వినియోగదారులకి అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఎప్పటి లాగానే No Cost EMI విధానాన్ని bajaj finserv EMI , amazon pay , icici debit , credit కార్డుల ద్వారా కల్పిస్తోంది. ఇక ఎక్స్చేంజ్ విధానం ద్వారా సుమారు 16 వరకూ పొందవచ్చు . అలాగే కొత్తగా చేరిన కస్టమర్లకి మొదటి కొనుగోలుపై ఉచిత డెలివరీ సదుపాయం అందిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: