ఇటీవ‌ల స్మార్ట్‌ఫోన్‌లపై యువతలో రోజురోజుకూ క్రేజ్‌ పెరిగిపోతోంది. మార్కెట్‌లోకి ఏ కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చినా అది యువత చేతుల్లోకి వెళ్లాల్సిందే. సెల్‌ఫోన్‌ లేకపోవడాన్ని నేటి యువత నామూషీగా భావిస్తున్నారంటే స్మార్ట్‌ఫోన్‌లు యువత జీవితంలో ఎంతగా మిలితమైపోయాయో చెప్పవచ్చు. కొత్త ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్‌లకు చాలా క్రేజ్‌ పెరిగింది. అయితే మీరు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? లేదా రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? మీ అంద‌రికి అదిరిపోయే గుడ్ న్యూస్‌.

 

ఎందుకంటే.. కొన్ని రెడ్‌మీ ఫోన్ల‌లో అద్భుతమైన ఫీచర్ రిలీజ్ చేసింది షావోమీ. ఇటీవల రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ ఫీచర్ అన్ని ఫోన్లల్లో అందుబాటులో లేదు. కొన్ని ఫోన్లకు మాత్రమే ఈ సర్వీస్ పరిమితం. అయితే కొన్నిరోజుల వరకు షావోమీకి చెందిన రెండు, మూడు ఫోన్లల్లో మాత్రమే వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. కానీ.. ఇప్పుడు ఏకంగా ఏడు స్మార్ట్‌ఫోన్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేసింది షావోమీ. 

 

మ‌రి ఈ ఫోన్ల‌పై ఓ లుక్కేస్తే పోల‌. రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో, రెడ్‌మీ నోట్ 8 ప్రో, రెడ్‌మీ 7,  రెడ్‌మీ వై3, రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ 7ఏ స్మార్ట్‌ఫోన్లకు VoWiFi ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమీ. అయితే వీటిలో రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కేవలం జియో వైఫై కాలింగ్ మాత్రమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని షావోమీ ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించింది. సో.. షావోమీ వైఫై కాలింగ్ అందిస్తున్న ఏడు స్మార్ట్‌ఫోన్లల్లో మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే మీరు వైఫై ద్వారా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: