స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. వాట్సాప్ లో కొన్నిసార్లు ఇతరులు పంపే మెసేజ్ లను బ్లూ టిక్స్ రాకుండా చదవాలని ఉంటుంది. మనం మెసేజ్ చదివినట్టు అవతలివారికి తెలియకూడదని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కొన్ని టిప్స్ ఫాలో అయితే రహస్యంగా మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ మెసేజ్ లను చదివే అవకాశం ఉంటుంది. 
 
ఒక ట్రిక్ ను ఫాలో అయితే అవతలివారికి మనం మెసేజ్ చదినప్పటికీ అవతలివారికి బ్లూ టిక్స్ కనపడవు. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులు ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలనుకునేవారు మూడు స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మొదటి స్టెప్ లో ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ మెసేజ్ కనిపించే వరకు వేచి ఉండాలి. 
 
వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత పాట్రన్ లాక్, ఫేస్ ఐడీ, పాస్ కోడ్ లను ఉపయోగించి మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ అన్ లాక్ అయిన తరువాత నోటిఫికేషన్ ను కొంచెం ఎక్కువ సమయం నొక్కడం ద్వారా యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదవటంతో పాటు అవతలివారికి మనం మెసేజ్ చదివినట్లు తెలీదు. ఈ ఫీచర్ వినియోగించాలంటే నోటిఫికేషన్ స్వైప్ చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రిక్ ఫాలో అవటం వలన అవతలివారికి మెసేజ్ చదివినప్పటికీ మనం మెసేజ్ చదివామనే విషయం తెలియదు. ఈ ఫీచర్ ఐఫోన్ 13 లో మరియు ఆండ్రాయిడ్ వెర్షన్ 9.0 తరువాత వెర్షన్లతో పని చేసే ఫోన్లలో లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: