కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇదే సరైన సమయం. అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ మీ కోసమే ఎదురుచూస్తున్నాయి. పండగ సీజన్లో అందమైన ఆఫర్లతో అతితక్కువ ధరకే స్మార్టఫోన్లు కొనుగోలు చేసేయండి. మరి ఆ అద్భుతమైన స్మార్ట్ఫోన్లు ఏంటో ఓ లుక్కేసేయండి. ముందుగా గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించిన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7 ప్రో. ఇటీవల రెడ్మీ నోట్ 7 ప్రో ధర భారీగా తగ్గింది. రూ.10,000 లోపే లభిస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.
6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 48+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా ఉండగా, ఫ్రంట్‌లో 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరాలున్నాయి. రెడ్మీ నోట్ 7 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్. రెడ్మీ నోట్ 7 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. అలాగే షావోమీ రిలీజ్ చేసిన 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 8 రూ.9,999 ధరకే లభిస్తోంది. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. అలాగే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
రెడ్మీ నోట్ 8 రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్, బ్యాటరీ 4,000 ఎంఏహెచ్ ఉన్నాయి. ఇటీవల లెనోవో కూడా కే10 నోట్ స్మార్ట్‌ఫోన్‌తో మిడ్ రేంజ్ సెగ్మెంట్ రేస్‌లో అడుగుపెట్టింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత. లెనోవో కే10 నోట్ 4 జీబీ+64 జీబీ ధరకే రూ.9,999 లభిస్తోంది. స్పెసిఫికేషన్స్ చూస్తే.. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. బ్యాటరీ 4,050 ఎంఏహెచ్. 16+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది