ఈ బీఎస్ఎన్ఎల్ ఉందే.. సిగ్నల్ తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ అని అంటున్నారు నెటిజన్లు.. మొన్నటికి మొన్న జియో వినియోగదారులకు షాక్ ఇచ్చినప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చింది. ఇప్పుడు ఉన్న ఆఫర్లలో కోత కొస్తుంది కోత. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరుకు ఉన్న టాప్ టెలికాం సంస్థల్లో ధరలను పెంచనిది ఇదే. 

 

మిగతా అన్ని నెట్ వర్క్ లు తమ టారిఫ్ లను 40 శాతం వరకు పెంచాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరలను పెంచలేదు. ఎందుకంటే ఈ బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఏ ఉండదు కాబట్టి. ఆలా పెంచకపోవడమే కాదు తన ప్లాన్ల ద్వారా వినియోగదారులకు భారీ స్థాయిలో డేటా లాభాలను కూడా అందిస్తోంది. 

 

కానీ అదే సమయంలో కొన్ని ప్లాన్ల వ్యాలిడిటీని భారీగా తగ్గిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ మూడు ప్లాన్లకు సంబంధించిన వ్యాలిడిటీని సగానికి పైగా తగ్గించింది. ఆ ప్లాన్స్ ఏంటి అంటే రూ.74 ప్లాన్ వ్యాలిడిటీ గతంలో 180 రోజులుగా ఉండేది. ఇప్పుడు దీని వ్యాలిడిటీని 90 రోజులకు తగ్గించారు. అయితే దీంతో పాటు 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 నిమిషాల వాయిస్ కాలింగ్ లాభాలు లభించనున్నాయి. 

 

రూ.75 ప్లాన్ వ్యాలిడిటీ కూడా రూ.74 ప్లాన్ తరహాలోనే 180 రోజుల నుంచి 90 రోజులకు వచ్చేసింది. 10 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా లభించనుంది. ఇక రూ.153 ప్లాన్ దీని వ్యాలిడిటీ కూడా 180 రోజుల నుంచి 90 రోజులకు వచ్చింది. రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఇలా ఆఖరికి బీఎస్ఎన్ఎల్ కూడా చేస్తే వినియోగదారులు ఏమైపోతారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: