ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఎక్క‌డోక‌క్క‌డ ఇలాంటివి జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక సాధార‌ణంగా జేబులో డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే, అమెజాన్ పే లాంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే వీటితో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ వ్యాలెట్‌లోని డబ్బులు మాయం అవడం ఖాయం. యాప్‌లో తమ డబ్బు సేఫ్‌గా ఉందని అనుకుంటారు కానీ.. ఏదో ఒక‌ చిన్న పొరపాటు వల్ల వ్యాలెట్‌లో క్యాష్ ఖాళీ అయిపోతున్నాయి.

 

అందుకే మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మీ యాప్స్‌ని సేఫ్‌గా ఎలా ఉంచాలో ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. ప్లే స్టోర్‌లో గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు జాగ్రత్త. ఎందుకంటే వీటిని పోలినట్టు ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉంటాయి. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఖ‌చ్చితంగా మోస‌పోతారు. అందుకే యాప్ డౌన్‌లోడ్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా యాప్ డౌన్‌లోడ్ చేయొద్దు. అలాగే యూపీఐ అకౌంట్... క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది.

 

ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులకు పిన్ ఉన్నట్టే యూపీఐ అకౌంట్‌కి కూడా పిన్ ఉంటుంది. మీరు ఎట్టిపరిస్థితుల్లో ఆ పిన్ ఎవరికీ చెప్పొద్దు. మీ యూపీఐ అకౌంట్ ఉన్న యాప్‌లో తప్ప మరే యాప్‌లో మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయొద్దు. మీరు డబ్బులు స్వీకరించేందుకు యూపీఐ పిన్ అవసరం ఉండదు. ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నామని, మీ యాప్‌లో వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేయండి అని అడిగితే అస్సలు పిన్ ఎంటర్ చేయొద్దు. ఎందుకంటే దాంట్లో ఏదో మోసం ఉన్న‌ట్టే. అలాగే మీరు డబ్బులు పంపడానికి, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: