ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడ‌కం ఎక్కువ అయ్యే కొద్దీ.. మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం విప‌రీతంగా వింటున్న పదమిది. రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడుతున్నారు. ఇక ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది యాప్స్ వైపు..గూగుల్ ప్లే స్టోర్‌లో ఆసక్తిగా ఏ యాప్ కనిపించినా వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు. అయితే ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

 

అలాగే ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్‌ని డిలిట్ చేసింది గూగుల్. సెక్యూరిటీ కంపెనీ బిట్‌డిఫెండర్ వాటిని రిస్క్‌వేర్ యాప్స్‌గా గుర్తించింది. అయితే ఇప్పటికే ఆ ఆ యాప్స్‌ని 5,50,000 సార్లు డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించింది గూగుల్. మ‌రి . వీటిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నవారి స్మార్ట్‌ఫోన్‌ రిస్కులో ఉన్నట్టే. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవడానికి ఈ యాప్స్ కారణం అవుతాయి. ఫుల్ స్క్రీన్ యాడ్స్ చూపిస్తూ మీకు చికాకు తెప్పిస్తుంటాయి. మీ ఫోన్ మోడల్, ఐఎంఈఐ నెంబర్, ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, లొకేషన్ లాంటి కీలక సమాచారాన్ని యాడ్ వెబ్‌సైట్లకు ఈ యాప్స్ పంపిస్తుంటాయి.

 

మ‌రి యాప్స్ ఏంటో ఓ లుక్కేసి వెంట‌నే డిలీట్ చేయండి. వాటిలో  కార్ రేసింగ్ 2019, బ్యాక్ గ్రౌండ్స్ 4కే హెచ్ డీ, బార్ కోడ్ స్కానర్ లాంటి యాప్స్ ముందు ఉన్నాయి. వీటితో పాటు క్యూఆర్ కోడ్ రీడర్ అండ్ బార్ కోడ్ స్కానర్ ప్రో, 4కే వాల్ పేపర్,  ఫైల్ మేనేజర్ ప్రో - మేనేజర్ ఎస్ డీ కార్డ్ / ఎక్స్‌ప్లోరర్, VMOWO సిటీ: స్పీడ్ రేసింగ్ 3డీ, స్క్రీన్ స్ట్రీమ్ మిర్రరింగ్,  క్యూఆర్ కోడ్ - స్కాన్ అండ్ రీడ్ ఎ బార్‌కోడ్‌, పీరియడ్ ట్రాకర్ - సైకిల్ ఓవ్యులేషన్ ఉమెన్స్, క్యూఆర్ అండ్ బార్‌కోడ్ స్కాన్ రీడర్, వాల్‌పేపర్స్ 4కే, బ్యాక్ గ్రౌండ్స్ హెచ్‌డీ, ట్రాన్స్ ఫర్ డేటా స్మార్ట్,  క్లాక్ ఎల్ఈడీ, ఎక్స్ ప్లోరర్ ఫైల్ మేనేజర్,  బిగ్ ఫిష్ ఫ్రెంజీ,  టుడే వెదర్ రాడార్ యాప్స్ ఉన్నాయి. సో.. బీ కేర్‌ఫుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: