మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉందా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్‌. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. జనవరి 19 నుంచి 22 వరకు ఆఫర్స్ అందరికీ లభిస్తాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు యోనో యాప్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసేవారికి డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ ప్రకటించింది. 

 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసిన వారు 10% డిస్కౌంట్ రూ.1,500 వరకు పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై షాపింగ్ చేస్తే 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే యోనో ఎస్‌బీఐ నుంచి కొనుగోళ్లు జరిపేవారికీ ఆఫర్స్ ఉన్నాయి. యోనో యాప్‌తో బిల్ పేమెంట్ చేస్తే 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్+బోనస్ ఆఫర్ పొందొచ్చు. రూ.25,000 కన్నా ఎక్కువ కొంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

 

ఇలాంటి ఆఫర్ల గురించి యోనో ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయిన తర్వాత బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. కాగా, మ‌రోవైపు అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, టీవీ కొనుగోలు చేసిన వినియోగదారులకు  రూ.6వేల క్యాష్ బ్యాక్, అడిషనల్ గా ఎక్సేంజ్ తో పాటు రూ.3 వేల డిస్కౌంట్ ను అందించేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లను ఆన్ లైన్ లో వన్ ప్లస్  స్టోర్, అమెజాన్ ఇండియా, ఆఫ్ లైన్ లో వన్ ప్లస్ స్టోర్ లో పొందవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: