మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేవరకు స్మార్ట్ ఫోన్ లోనే ఉంటాం. ఎక్కువ భాగం అంటే మనం సెల్ వినియోగించుకునే సమయంలో దాదాపు 70 శాతం వాట్సాప్ ఏ ఉపయోగిస్తాం. కారణం ఏ పని ఉన్న సరే.. ఎవరితో మాట్లాడాలన్నా సరే మనకు వాట్సాప్ ఎంతో ఉపయోగ పడుతుంది. 

 

క్షణాల్లో పని అయిపోతుంది అందుకే వాట్సాప్ ఎక్కువగా వినియోగిస్తాం. చెప్పాలంటే వాట్సాప్ మన జీవితంలో నిత్యావసరం. బిజినెస్ డీల్స్, ఆఫీస్ వర్క్ అన్ని. ఎవరికైన ఏదైనా ఫోటో పంపాలంటే లేదా వీడియో పంపాలంటే వెంటనే మనం ఉపయోగిచ్చేది వాట్సాప్. అయితే ఇప్పుడు ఈ వాట్సాప్ డౌన్ అయ్యింది. 

 

ప్రస్తుతం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొన్ని టెక్నికల్  సమస్యలను ఎదుర్కొంటోంది. ఫోటోలు, జిఐఎఫ్‌లు, స్టిక్కర్లు, వీడియోలను పంపడం లేదా స్వీకరించడం కుదరడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ డౌన్ అయ్యింది. నార్మల్ మెసేజెస్ మాత్రం వెళ్తున్నాయి. 

 

సాయంత్రం 4:00 గంటల నుంచి ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. కాగా సమస్య తమ దృష్టికి వచ్చిందని, వీలైనంత త్వరగా సేవలు పునరుద్దరిస్తామని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. కాగా ప్రస్తుతం ట్విట్టర్ లో సమస్యలపై ఓ రేంజ్ లో చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం 'whatsappdown' అనే హ్యాష్ టాగ్ తో వరల్డ్ ట్రేండింగ్ లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: