స్మార్ట్‌ఫోన్ల గురించి తెలిసిన ఎవరికైనా ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేని పదం... గూగుల్‌. ఏ అవసరం వచ్చినా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ఓ అలవాటుగా మారిపోయింది. అలాగే గూగుల్ ప్లేస్టోర్ గురించి కూడా చెప్పాల్సిన ప‌ని లేదు. ఏ యాప్ కావాల‌న్నా గూగుల్ ప్లేస్టోర్‌ను వెతికి డౌన్‌లోడ్ చేసేసుకుంటారు. ప్లేస్టోర్ లో మనకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో చాలావరకు ఫ్రీ యాప్స్ ఉంటాయి. కొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి. అంటే మనం డబ్బులు చెల్లిస్తేనే ఆ యాప్ డౌన్ లోడ్ అవుతుందన్న మాట. అయితే ఇప్పుడు పెయిడ్ యాప్స్ గురించి ఈ విష‌యం తెలుసుకోండి.

 

అయితే కొన్నిసార్లు ప్లేస్లోర్ లో మనకు అవసరమైన యాప్స్ ను కొనుగోలు చేస్తాం. అయితే మనం ఆ యాప్స్ ను కొనుగోలు చేయడానికి ఇచ్చిన మన బ్యాంకింగ్ వివరాలను అందించాలి. మనకు యాప్స్ కొనుగోలును సులభం చేయడానికి గూగుల్ ఆ వివరాలను స్టోర్ చేసుకుంటుంది. మ‌నం వాడుతున్నంతసేపు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కాని.. ఎప్పుడైనా పిల్ల‌ల చేతికి ఫోన్ చిక్కితే.. వాళ్ల‌కు తెలియ‌కుండా ఏదో ఒక‌టి నొక్కేస్తారు. అలాంటి స‌మ‌యంలో పొర‌పాటును ప్లేస్టోర్ లో ఏదైనా పెయిడ్ యాప్ మీద క్లిక్ చేశారంటే మీ ఆకౌంల్ ఖాళీ అయిన‌ట్టే. 

 

ఎందుకంటే  అంతకుముందు అందించిన వివరాలను గూగుల్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి వెంటనే మన ఖాతా నుంచి డ‌బ్బంతా క‌ట్ అవుతుంది. మ‌ళ్లీ దాని తిరిగి పొందాలంటే అసాధ్య‌మ‌నే చెప్పాలి. కాని ప్లేస్టోర్ లో పేరెంటల్ కంట్రోల్స్ అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఈ పేరెంటల్ కంట్రోల్ కేవలం యాప్స్ ను, గేమ్స్ ను ఫిల్టర్ చేయడమే కాకుండా చెల్లింపులు జరిపేటప్పుడు పాస్ వర్డ్ అందించకపోతే ఆ కొనుగోలు జరగకుండా కూడా చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: