ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్న వాళ్లంద‌రూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ అంటూ సోషల్ మీడియా యుగంలో బ్ర‌తుకుతున్నారు. ఇక ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ మంది ఉపయోగించేది ఫేస్ బుక్. మనం ఏదైనా పోస్ట్ చేస్తే అది మన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో అందరికీ చేరిపోయి వారి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. దీనికి తగ్గట్లే లైకులు, కామెంట్ల కోసం పోస్ట్ చేసే వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవ‌ల ఫేస్ బుక్ ఫ్రెండ్స్ జాబితాలో పట్టుమని పది శాతం కూడా తెలిసిన వారు ఉండటం లేదు. 

 

దీని వల్లనే ఫేస్ బుక్ ద్వారా జరిగే నేరాలు కూడా ఎక్కువ అవుతూ వ‌స్తున్నాయి. అలాగే మ‌నం ఫేస్‌బుక్‌లో చేసే చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.  ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎనిమిది వంద‌ల‌ మంది ఉన్నారు అంటే.. మీకు ఎనిమిది వంద‌ల‌ మంది స్నేహితులు ఉన్నట్లు కాదు. కాబట్టి మీ ఫేస్ బుక్ అకౌంట్ లో ఎవరిని పడితే వాళ్లను యాడ్ చేసుకోవడం మానేయండి. మీ ఇంటి చిరునామా, పని వేళలు, ఇతర వివరాల వంటి సమాచారం మాత్రం మీ ఫేస్‌బుక్‌లో అస్సలు పోస్ట్ కానీ, షేర్ కానీ చేయకండి. దీందో మీరు డేంజ‌ర్‌లో ప‌డాల్సి వ‌స్తుంది.

 

ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన భాషను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఒక వ్యక్తిని ఉద్దేశించినప్పుడు మాత్రమే కాకుండా, సాధారణంగా పోస్ట్ చేసేటప్పుడు కూడా అభ్యంతరకరమైన భాషను వాడ‌కూడ‌దు.  పాస్ పోర్ట్, సర్టిఫికెట్లు, డిగ్రీల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగ‌తులు. మీ ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో ఉన్న ప్రతి విషయం పబ్లిక్‌గా ఉంచడం అంత మంచి ఆలోచన కాదు.. ఇందులో మీ పాఠశాల, కళాశాల, మీ సొంత ఊరి పేర్లు కూడా ఉంటాయి.  దీని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సో.. బీకేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: