మనం ప్రయాణం చేస్తుంటాం.. ఎంత 100 పర్సెంట్ పెట్టుకున్న సరే మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ తగ్గిపోతుంది.. అప్పుడు ఎలా చెయ్యాలి? ఏమి చెయ్యాలి ?.. ఛార్జింగ్ తగ్గకూడదు అంటే ఏం చెయ్యాలి. ఛార్జింగ్ ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇక్కడ ఉన్న చిట్కాలు చదివి తెలుసుకోండి... మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ని కాపాడుకొండి. 

 

1. ప్రస్తుతం ప్రతి మొబైల్ లో బ్యాటరీ సేవింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రయాణం చేసే సమయంలో ఆ ఆప్షన్ ఉపయోగిస్తే చాలు.. ఛార్జింగ్ అయిపోకుండా కాపాడుతుంది. 

 

2. మీకు నిద్ర వస్తుంది.. ప్రయాణంలో ఫోన్ వాడటం లేదు.. అప్పుడు ఫోన్ లో ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే చాలు మీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోదు.. ఎందుకంటే ఆ సమయంలో డేట్ ఆన్ లో ఉండదు.. ఏ మెసెజ్ లు.. ఫోన్ లు రావు. 

 

3. ఎయిర్ ప్లేన్ మోడ్ తో పాటు లొకేషన్ కూడా ఆఫ్ చెయ్యండి.. అప్పుడే బ్యాటరీ లైఫ్ తగ్గకుండా చూస్తుంది. 

 

4. డిస్ ప్లే బ్రైట్ నెస్ ను తగ్గించాలి.. అప్పుడే బ్యాటరీ తగ్గకుండా ఉంటుంది. 

 

5. ఒకవేళ వైఫ్ అందుబాటులో ఉంటె మొబైల్ డేటా బదులు వైఫ్ నెట్వర్క్ వాడండి. బ్యాటరీ తగ్గకుండా ఉంటుంది. 

 

6. అలాగే ఎక్కువ డేటా గల యాప్స్ కాకుండా లైట్ యాప్స్ ని ఉంచుకోండి. మీ బ్యాటరీ తగ్గకుండా కాపాడుతుంది. 

 

7. అలాగే.. మాములుగా మీ ఫోన్ వేడి అవుతూ ఉంటుంది.. అయితే మీ ఫోన్ కూల్ గా ఉంచడానికి ప్రయత్నించండి.. అప్పుడే మీ ఫోన్ పాడవకుండా ఉంటుంది. 

 

8. పవర్ బ్యాంకు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి.. అప్పుడే మీకు ఏ ఇబ్బంది కలగదు. తగ్గిన బ్యాటరీని ఈ పవర్ బ్యాంకుతో ఫుల్ చేసుకోండి. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ బ్యాటరీని జాగ్రత్తగా కాపాడుకోండి..  

మరింత సమాచారం తెలుసుకోండి: