ఈ మ‌ధ్య కాలంలో రియ‌ల్‌మీ ఫోన్లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఈ ఫోన్ల‌ను కొన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నాయి. వాస్త‌వానికి మొద‌టిలో పెద్దగా ఇమేజ్‌ లేని రియల్‌మీ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లు నెమ్మదిగా క్రేజ్‌ సంపాదించుకుంటున్నాయి. ప్ర‌స్తుతం రియల్‌మీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ తర్వాత అదే స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్న కంపెనీ. ఇక తాజాగా తమ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారికి కొత్తకొత్త ఫీచర్స్ అందిస్తోంది రియల్‌మీ. అదేంటంటే.. ఇప్పుడు రియల్‌మీ యూజర్ ఇంటర్‌ఫేస్ రిలీజ్ చేసింది. మ‌రి దీని ప్ర‌త్యేక‌త‌లు ఏంటో ఓ లుక్కేసేయండి మ‌రి..!

 

 రియల్‌మీ యూజర్ ఇంటర్‌ఫేస్-UI... కొద్దిరోజుల క్రితమే ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్‌మీ యూఐ ప్రకటించింది కంపెనీ. ఇప్పుడు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లకు రియల్‌మీ యూఐ అప్‌డేట్స్ వస్తున్నాయి. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రియల్‌మీ యూఐ రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. ఐకాన్స్ కస్టమైజేషన్, ప్రకృతిని తలపించే వాల్ పేపర్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ లాంటి ప్రత్యేకతలు రియల్‌మీ యూఐలో ఉంటాయి. అలాగే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, మెసేజెస్‌కు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.

 

రియల్‌మీ ఫోన్లన్నీ కలర్ ఓఎస్‌తో పనిచేన్నాడు. అయితే కలర్ ఓఎస్ నచ్చనివాళ్లు రియల్‌మీ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూప‌డం లేద‌ని గుర్తించారు. దీంతో సొంతగా యూఐ రూపొందించింది రియల్‌మీ. మ‌రియు సాధార‌ణంగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మూడు వేళ్లతో స్క్రీన్‌పైన స్వైప్ చేస్తుంటాం. కాని.. రియల్‌మీ యూఐలో జస్ట్ మూడు వేళ్లతో హోల్డ్ చేస్తే స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. ఇక ఇప్పటికే కొన్ని ఫోన్లకు రియల్‌మీ యూఐ రిలీజ్ అయింది. అలాగే త్వ‌ర‌లోనే అన్ని ఫోన్ల‌కు ఈ సౌక‌ర్యం అందుబాటులోకి రానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: