ప్ర‌స్తుత ఆధునిక యుగంలో ల్యాప్ టాప్ ల‌ వినియోగం ఎక్కువ అయిపోయింది. అయితే ఒక్కోసారి మ‌నం యూజ్ చేసే బ్రౌజ‌ర్ స్లోగా ర‌న్ అవ్వ‌డం, లేదా బ్యాట‌రీ అయిపోవ‌డం, స్ట‌క్ అయిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. అలాంటి స‌మ‌యంలో మ‌న‌కు వ‌చ్చే చిరాకు అంతా ఇంకా కాదు.  సమయం వృథా కావడంతో పాటు వివిధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే ల్యాప్ టాప్ వాడే వారు కొన్ని టిప్స్ పాటిస్తే ఇలాంటి స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మీ ల్యాప్ టాప్ యాక్టివ్ గా ఉన్నప్పుడు మీరు బ్యాటరీ సేవ్ మోడ్ చేశారంటే ఆటోమేటిగ్గా మీకు బ్యాటరీ లో అయినప్పుడు తెలుస్తుంది. 

 

మీకు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందని మళ్లీ మీకు గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటప్పుడు కంప్యూటర్ మీద చురుగ్గా పని చేయడం, తర్వాత చటుక్కున లేచి వెళ్ళిపోవడం, మళ్లీ ఇప్పుడే వచ్చి పని చేసుకుంటాం కదాని అనుకోవడం సాధారణంగా జరగుతుంది. అది సరికాదు. కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా షట్ డౌన్ చేయాలి. తరచూ అలా చేస్తే పాడవుతుందన్నది అపోహ మాత్రమే. నిజానికి మన్నిక కాలం పెరుగుతుంది. చెత్త అంటే గుర్తొచ్చింది.బైక్ ని ఎలాగైతే రోజు క్లీన్ చేసుకుంటారో, అలాగే ల్యాప్ టాప్ ని రోజూ క్లీన్ చేసుకోండి.

 

మల్టీపుల్ యాప్ప్ ఏమైనా ఉంటే వాటిని మీరు వాడనప్పుడు ఆపేయండి.టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి Ctrl+Shift+Esc ప్రెస్ చేయండి. అక్కడ ఏమైనా మీకు పనికిరాని వాటిని Ctrl+Alt+Del ప్రెస్ చేసి తీసిపారేయండి. ఒకే సార మీరు నాలుగైదు పోగ్రాములు రన్ చేయడం వల్ల కూడా బ్యాటరీ తొందరగా డెడ్ అయిపోతుంది. సో దీనిని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాటరీకాపాడుకోవచ్చు. ల్యాప్ టాప్ ని ఏయిర్ ఫ్లో బాగా ఉన్న సర్ఫేస్ పై లేదా కూల్ టెంపరేచర్ వాడండి. లేదంటే హ్యాంగ్ అవడం, హీటింగ్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.
 

 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: