వైఫై.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఎందుకంటే టెక్నాల‌జీతో ముడిప‌డి ఉన్న ఈ స‌మాజానికి వైఫై అవ‌స‌రం ఖ‌చ్చితంగా ఉంది. వాస్త‌వానికి ఒక‌ప్పుడు ఆఫీసుల్లో మాత్రమే వైఫై ఉండేది. కాని, ఇప్పుడు ప్ర‌తి ఇంటికి వైఫై ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం టెలికాం కంపెనీలు కూడా అవుట్ గోయింగ్ కాల్స్‌కు డ‌బ్బులు వాసూల్ చేస్తున్నాయి. దీంతో సాధారణ కస్టమర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఆపరేటర్లంతా వారివారి కస్టమర్లను నిలుపుకునేందుకు కొత్త మార్గాలు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

 

అందులో ఇప్పుడు రిలియన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు వైఫై కాలింగ్‌ సేవలను.. కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. వివోవైఫై లేదా వాయిస్ ఓవ‌ర్ వైఫైనే.. వైఫై కాలంగ్ అంటారు. మనం సాధారణంగా మొబైల్‌ నుంచి చేసే కాల్స్ అన్నీ.. సంబంధిత మొబైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వెళ్తాయి. అయితే వీవోవైఫైలో మనం చేసే కాల్స్‌ అన్నీ.. వైఫై ద్వారా వెళ్తాయి. అందుకే దీనిని వైఫై కాలింగ్‌ అని పిలుస్తారు. ఈ వైఫై కాలింగ్ సర్వీసుకు ఎలాంటి రుసుమును కూడా వసూలు చేయడం లేదని జియో వంటి సంస్థలు పేర్కొన్నాయి. 

 

మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్.. కొన్ని చోట్ల చాలా వీక్‌గా ఉంటాయి. ఆ సమయంలో కాల్స్ చేస్తే డ్రాప్ అవుతుంటాయి. వాయిస్‌లో క్లారిటీ కూడా ఉండదు. కానీ వైఫై కాలింగ్‌లో అలా డ్రాపింగ్ సమస్య తలెత్తే అవకాశం చాలా తక్కువ.  కాల్స్ మధ్యలో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు. అంటే, సెల్‌ సిగ్నల్‌ లేకున్నా, వైఫై ఉంటే చాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: