ఇటీవ‌ల కాలంలో ఏది కావాల‌న్నా.. ఏం తెలుసుకోవాల‌న్నా గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. అలాగే మ‌నం  ఏదైనా ఉత్పత్తి గురించి సెర్చ్ చేసినప్పుడు, వెంటనే మీకు వచ్చిన యాడ్ లో ఆ వస్తువు లేదా ఉత్పత్తికి సంబంధించినవి ఉంటుంటాయి. ఈ అనుభవం మీకు కూడా కలిగే ఉంటుంది కదూ. మరి ఇదెలా సాధ్యం? మనం సెర్చ్ చేసిన సమాచారం వారికెట్లా తెలుస్తోంది? అన్న ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంటాయి. వాస్త‌వానికి గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది.

 

ఇక ఇటీవ‌ల యూజర్ సెర్చ్ హిస్టరీకి సంబంధించిన రిజల్ట్స్‌ను స్ర్కీన్ షాట్స్ రూపంలో గూగల్ భద్రపరచటం మొదలుపెట్టింది. ఈ స్ర్కీన్ షాట్స్‌ను మీరు చూడాలనుకుంటున్నట్లయితే గూగుల్ సెర్చ్ యాప్‌లోకి వెళ్లి, మెయిన్ స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే క్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే, మీ సెర్చ్ హిస్టరీకి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ కనిపిస్తాయి. మీకు కావల్సిన తేదీకి సంబంధించిన సెర్చ్ హిస్టరీని ఇక్కడ పొందే వీలుంటుంది. అయితే దీంతో కొంద‌రు ఇబ్బంది ప‌డుతున్నారు.

 

కాని, యూజర్లు ఓ సింపుల్ హ్యాక్‌ను ప్రయోగించటం ద్వారా స్ర్కీన్‌షాట్‌లను డిలీట్ చేయవచ్చు. స్ర్కీన్‌షాట్‌లను డిలీట్ చేసే క్రమంలో ముందుగా గూగల్ సెర్చ్ యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే హిస్టరీ ఐకాన్ పై టాప్ చేయండి. వెంటనే గత ఏడు రోజులకు సంబంధించిన సెర్చ్ ఫలితాలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఒక్కో స్ర్కీన్‌షాట్‌ను స్వైప్ అప్ చేయటం ద్వారా అవి డిలీట్ అవుతాయి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: