ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్‌ వినియోగమూ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సోష‌ల్ మీడియా రోజు రోజుకు విస్త‌రిస్తోంది. ముఖ్యంగా యువ‌త ఇందులో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ వేదిక ద్వారా  ప్రపంచంలో  ఏమూల ఏం జరిగినా  క్షణాల్లో  తెలిసిపోతోంది. అయితే మన ఫోన్‌లో మనకు తెలియకుండానే కొంత ఇంటర్నెట్‌ వినియోగం జరిగిపోతుంటుంది. దీని వల్ల డేటా త్వరగా అయిపోతుంది. ఇక అప్పుడు మ‌న‌కు వ‌చ్చే కోపం అంతా ఇంతా కాదు. వాస్త‌వానికి ఫోన్‌లు చేతుల్లోకి వచ్చాక ప్రతిక్షణాన్ని, ప్రతి సందర్భాన్ని పోస్టులు, ట్వీట్లు, అప్‌డేట్లతోనే ఆస్వాదిస్తున్నారు.

 

ఇలా సోషల్ మీడియా యూసేజ్ పెరుగుతోన్న కొద్ది మొబైల్ డేటా వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. అయితే సోషల్ మీడియా యాప్స్‌ను ఫోన్‌లో వినియోగిస్తున్నప్పుడు డేటాను మరింతగా ఆదా చేసుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రతిసారి ఎంతోకొంత మొబైల్ డేటా ఖర్చవుతూనే ఉంటుంది. ఫేస్‌బుక్ అకౌంట్‌లను రోజు గంటల తరబడి వినియోగించుకునే యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా సేవ‌ర్ ఆప్ష‌న్‌ను ఆన్ చేసుకున్నట్లయితే మొబైల్ డేటా ఆదా అవుతుంది.

 

అలాగే ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి. ఇక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను గంటల తరబడి వినియోగించుకునే యూజర్లు మొబైల్ డేటాను పొదుపుగా వాడుకునే క్రమంలో యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యూజ్ లెస్ డేటా ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే డేటాను కాపాడుకొవ‌చ్చు. వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడటం వల్ల మొబైల్ డేటా వినియోగాన్ని మరింతగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: