దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఆ మార్పులు బ్రాడ్ బ్యాండ్ వైపుకు వెళ్లడం శరవేగంగా జరిగిపోతోంది. వాస్త‌వానికి జియో రాక‌తో ఫైబర్ దెబ్బకు బ్రాడ్ బ్యాండ్ సంస్థలు వారి ప్లాన్ లను సవరించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అన్ని టెల్కోలు ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ వైపు దృష్టి సారించాయి. అయితే ఇందులో భాగంగానే రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించేందుకు రెడీ అయింది. అయితే రిలయన్స్ జియో కీ పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ కూడా నూతనంగా పలు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇక‌ ప్రస్తుతం రూ.1,000లోపు అద్భుత‌మైన‌ లాభాలను అందించే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లుపై ఓ లుక్కేసేయండి..!

 

జియో రూ.699 ప్లాన్.. . ఈ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే 100 జీబీతో మరో 50 జీబీ అదనంగా లభిస్తుంది. అంటే మొత్తంగా 150 జీబీ లభిస్తుంది. దీని నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ గా ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా ఫ్రీ కాలింగ్, హోం నెట్ వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ వంటి లాభాలు  పొందవచ్చు. అంతేకాకుండా టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్, జీరో లేటెన్సీ గేమింగ్ వంటి అదనపు లాభాలు కూడా ఈ ప్లాన్ అందిస్తోంది. ఎయిర్ టెల్ రూ.799 ప్లాన్.. 150 జీబీ డేటాను అందిస్తోంది. దీని నెట్ స్పీడ్ 150 ఎంబీపీఎస్ గా ఉంది. 

 

ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందించనున్నారు. బీఎస్ఎన్ఎల్ రూ.749 ప్లాన్.. ఈ ప్లాన్ ద్వారా 300 జీబీ డేటాను అందిస్తారు. దీని నెట్ స్పీడ్ 50 ఎంబీపీఎస్. ఈ ప్లాన్ ద్వారా హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ రూ.949 ప్లాన్..  500 జీబీ డేటాను అందించనున్నారు. నెట్ స్పీడ్ 500 ఎంబీపీఎస్. 

 

ఈ ప్లాన్ ద్వారా హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కూడా ల‌భిస్తుంది. ​బీఎస్ఎన్ఎల్ రూ.849 ప్లాన్..  ద్వారా 600 జీబీ డేటాను అందించనుంది. నెట్ స్పీడ్ 50 ఎంబీపీఎస్ గా ఉండనుంది. అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఇందులో  అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ రూ.999 ప్లాన్.. ఈ ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్ తో 300 జీబీ డేటాను అందిస్తారు. ఇక అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా ల‌భిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: