ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతూ వ‌స్తోంది. దీంతో ఇంటర్నెట్‌ వినియోగమూ విపరీతంగా పెరుగుతోంది. అయితే మన ఫోన్‌లో మనకు తెలియకుండానే కొంత ఇంటర్నెట్‌ వినియోగం జరిగిపోతుంటుంది. దీని వల్ల డేటా త్వరగా అయిపోతుంది. ఇక అలా డేటా అయిపోయిన‌ప్పుడు మ‌న‌కు వ‌చ్చే కోపం అంతా ఇంతా కాదు. అయితే ఇలాంటి వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్‌. అది కూడా జియో యూజ‌ర్లు అయితేనే. అస‌లు విష‌యం ఏంటంటే.. మీ ఫోన్ లో డేటా అయిపోయినప్పుడల్లా మీరు ఓ చిన్న ట్రిక్ ను ఫాలో అయితే మీరు ఉచితంగా డేటాను పొందవచ్చు.

 

రిలయన్స్ జియో తన నెట్ వర్క్ నుంచి వేరే నెట్ వర్క్ కు చేసుకునే కాల్స్ కు 6 పైసల చొప్పున ఐయూసీ చార్జీలను విధిస్తుంది అయితే ఈ ఐయూసీ ప్లాన్లు రూ.10 నుంచి స్టాట్ అవుతున్నాయి. అయితే ఈ రూ.10తో రీచార్జ్ చేసుకుంటే మీకు టాక్ టైంతో పాటు 1 జీబీ డేటాను కూడా జియో ఉచితంగా అందిస్తుందన్న మాట. అలా మీకు ఎంత డేటా కావాలనుకుంటే అంత మొత్తంతో ఐయూసీ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లు రూ.10 నుంచి రూ.100 వరకు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.50తో రీచార్జ్ చేసుకుంటే రూ.39.37 బ్యాలెన్స్ లభిస్తుంది. అంటే 656 ఐయూసీ నిమిషాలు ల‌భిస్తాయి. 

 

అదే విధంగా, 5 జీబీ డేటా లభిస్తుంది. అదే డేటా వోచర్లను తీసుకుంటే రూ.101 రీచార్జ్ చేసుకుంటే మీకు 6 జీబీ డేటా లభిస్తుంది. అలాగే డేటా మాత్ర‌మే కావాల‌నుకుంటే దానికి కూడా ప్లాన్లు ఉన్నాయి. సో.. డేటా వోచర్ల కంటే ఐయూసీ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే అద్భుత‌మైన లాభాలు పొందొచ్చు. ఎయిర్ టెల్, వొడాఫోన్ ల్లో మీరు సాధారణ రీచార్జ్ చేసుకుంటే మీకు ఉచిత డేటా లభించదు.  అయితే ఈ నెట్ వర్క్ లు ఉపయోగించేవారికి ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: