కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? అయితే కాస్త వెయిట్ చేయండి సుమీ..? ఎందుకంటే అతి చ‌వ‌క ధ‌ర‌కే పాపప్ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇన్ ఫీనిక్స్ మరో ఫోన్ ను ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నట్లు విసృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఈసారి మాత్రం రికార్డు క్రియేట్ చేసే త‌ర్హాలో కేవలం రూ.10,000 లోపే పాపప్ సెల్ఫీ కెమెరా ఉన్న కెమెరాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మ‌రి ఇదే నిజమైన పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో రూ.10 వేల లోపు ధరతో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే అవ్వ‌డం విశేషం.

 

ఇక‌ ఈ ఫోన్ ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి తీసుకురావాలని ఇన్ ఫీనిక్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి పాప్-అప్ సెల్ఫీ కెమెరాల్లో అత్యంత చవకైనది హానర్ 9ఎక్స్. దీని ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు దీని కంటే త‌క్కువ ధ‌ర‌కే మ‌రో స్మార్ట్‌ఫోన్ తీసుకురాబోతుందంటే నిజంగా పండ‌గే మ‌రి. అయితే ఇన్ ఫీనిక్స్ ఎస్5 కంటే ఇందులో అప్ గ్రేడెడ్ ఫీచర్లు ఉండనున్నాయని భావించ‌వ‌చ్చు. 6.5 లేదా 6.6 అంగుళాల డిస్ ప్లేతో పాటు 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

 

అంతేకాదండోయ్‌ ఇందులో వెనకవైపు నాలుగు కెమెరా సెటప్‌ను అందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ను ఉపయోగించనున్నారని కొన్ని లీకుల ద్వారా తెలుస్తోంది. కాగా, గత ఏడాది బడ్జెట్ విభాగంలో ఇన్ ఫీనిక్స్ చాలా దూకుడుగా వ్యవహరించింది. రూ.10 వేల లోపు ఎనిమిది స్మార్ట్‌ఫోన్‌లను ఇన్ ఫీనిక్స్ లాంచ్ చేసింది. ఇక ఈ సంవ‌త్స‌రం సంచ‌ల‌నం సృష్టించేందుకు తెర లేపింది ఇన్ ఫీనిక్స్. మ‌రి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఫిబ్రవరి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: