వాట్సాప్... నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ మెసేజింగ్ యాప్ జీవితాలతో పెనేసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ ఇది. టెక్నాలజీ రోజురోజుకు పెరిగినట్లుగానే వాట్సాప్ వాడే వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. అలాగే మ‌రోవైపు మోసాలు పెరుగుతున్నాయి. 

 

అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వాట్సప్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం రేపాయి. అదే నిజమైతే జెఫ్ బెజోస్ మాత్రమే కాదు... మీ అందరి వాట్సప్ రిస్కులో ఉన్నట్టే.  అయితే వాట్సప్‌లో ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు ఎప్పుడూ బయటపడుతూనే ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోవడానికి మార్గాలున్నాయి. వాస్త‌వానికి వాట్సాప్ లో అందరికీ తెలియని ఫీచర్స్, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. అవి యూజ్ చేసి మీ వాట్సాప్ హ్యాక్ కాకుండా సేఫ్‌గా కూడా ఉంచుకోవ‌చ్చు. ముందుగా మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయండి. ఎందుకంటే ఏవైనా సెక్యూరిటీ సమస్యలు ఉంటే వాట్సప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపిస్తూ ఉంటుంది.

 

ఇక మీ సెట్టింగ్స్ లో అకౌంట్‌పై క్లిక్ చేసి.. అందులో టూ స్టెప్ వెరిఫికేష‌న్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎన‌బుల్‌పై క్లిక్ చేస్తే..  6 అంకెల పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి 6 అంకెల పిన్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మరోసారి అదే పిన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాతి స్టెప్‌లో ఇమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ స్టెప్స్ పూర్తి చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ అవుతుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీ వాట్సప్‌ని మరింత సేఫ్‌గా మార్చేందుకు అవకాశం లభిస్తుంది. ఇక దీని వ‌ల్ల మీ ఫోన్ నెంబర్ ఎవ‌రికైనా తెలిసినా, మీ సిమ్ కార్డ్ వేరొకరికి దొరికినా వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయడం సాధ్యం కాదు. దీంతో మీ వాట్సాప్ సేఫ్‌గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: