వాస్త‌వానికి మొద‌టిలో పెద్దగా ఇమేజ్‌ లేని రియల్‌మీ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లు నెమ్మదిగా క్రేజ్‌ సంపాదించుకుంటున్నాయి. దీంతో ఈ మ‌ధ్య కాలంలో రియ‌ల్‌మీ ఫోన్లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది.  ప్ర‌స్తుతం రియల్‌మీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ తర్వాత అదే స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్న కంపెనీ. ఇక రియ‌ల్ మీ ప్రియుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.  రియల్‌మీ నుంచి తక్కువ ధరలో మరో ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే వారం రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. 

 

అయితే లాంచ్ కు ముందే ఈ ఫోన్ కు సంబంధించిన మైక్రో సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యక్షమయింది. ఇందులో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను తెలిపారు. ఇప్పటికే సీ సిరీస్‌లో రియల్‌మీ సీ1, రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే సిరీస్‌లో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది కంపెనీ. ఇక  మైక్రో సైట్ ప్రకారం ఈ ఫోన్ వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ తో రానుంది. వెనకవైపు ప్యానెల్ బ్లూ కలర్ లో ఉండనుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌,  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండ‌నున్నాయి.

 

అలాగే 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నట్లు తెలిపారు. 6.5 అంగుళాలు డిస్‌ప్లే, 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ల‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. కాగా, ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 12.30 గంటలకు ఇండియాలో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: