సోషల్ కెప్టెన్ అని పిలువబడే సోషల్ మీడియా బూటింగ్ సేవ, వినియోగదారులు వారి ఇన్‌స్టాగ్రామ్ అనుచరుల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది.  ఈ సేవ,  సంభావ్య హ్యాకర్ల కోసం వేలాది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల  పేర్లు మరియు పాస్‌వర్డ్‌లను లీక్ చేసింది.   టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, సోషల్ కెప్టెన్ బూటింగ్ సేవ లింక్డ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను గుప్తీకరించని సాదా వచనంలో నిల్వ చేసింది.   ఈ సేవ సెక్యూరిటీ పరంగా చాలా బలహీనంగా వుండి  ఎవరైనా సోషల్ కెప్టెన్ యూజర్ యొక్క  ప్రొఫైల్‌కు లాగిన్ అవ్వకుండా  ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల  లాగిన్ ఆధారాలను యాక్సెస్  చేయవచ్చు.

 

 

 

 

 

భద్రతా కారణాల దృష్ట్యా తన పేరును గోపనీయంగా ఉంచాలని కోరిన  ఒక  భద్రతా పరిశోధకుడు, సోషల్ కెప్టెన్ సెక్యూరిటీ పరంగా గల లోపాలను ఎత్తి  చూపుతూ    సుమారు 10,000 స్క్రాప్ చేసిన ఇన్స్టాగ్రామ్  వినియోగదారుల ఖాతాల స్ప్రెడ్‌షీట్‌ను టెక్ క్రంచ్‌ వెబ్సైటు కు  అందించాడు  అని నివేదిక తెలిపింది.  ఇందులో  సుమారు 70 ఖాతాలు చెల్లింపు వినియోగదారుల  ప్రీమియం ఖాతాలు.  లాగిన్ వివరాలను  సరిగ్గా నిల్వ చేయక పోవడం  ద్వారా  సోషల్ కెప్టెన్  సేవ తన సేవా నిబంధనలను ఉల్లంఘించిందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.   మేము దర్యాప్తు చేస్తున్నాము మరియు తగిన చర్యలు తీసుకుంటాము. యూజర్లను, తమకు తెలియని లేదా నమ్మని వ్యక్తికి వారి పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ ఇవ్వవద్దని మేము గట్టిగా ప్రోత్సహిస్తున్నాము  అని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.   

 

 

 

 

 

 

 

 

 

సినాప్సిస్ సాఫ్ట్‌వేర్ ఇంటెగ్రిటీ గ్రూప్‌లో సెక్యూరిటీ సొల్యూషన్స్ మేనేజర్ ఆడమ్ బ్రౌన్ ప్రకారం, అన్ని సాఫ్ట్‌వేర్  ల లో సెక్యూరిటీ పరంగా బలహీనతలకు   సుమారు 50% డిజైన్ లోపాలు కారణం.  ముంబయికి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ   లక్షలాది మంది ప్రముఖులు మరియు ప్రభావశీలుల వ్యక్తిగత డేటా తన ప్లాట్‌ ఫాం పై బహిర్గతం చేయడం తో  ఇన్‌స్టాగ్రామ్ గత సంవత్సరం మే నెల లో  ఇబ్బందుల్లో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: