స్మార్ట‌ఫోన్ల వినియోగం పెరిగే కొద్ది వాట్సాప్ వినియోగం కూడా పెరుగుతూ వ‌స్తోంది. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను అక‌ర్షించేందుకు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటుంది. ఇది కూడా వాట్సాప్ వినియోగం పెర‌గ‌డానికి ఓ కార‌ణంగా చెప్పాలి. అయితే మీరు వాట్సప్ స్టిక్కర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? వేర్వేరు స్టిక్కర్ ప్యాక్స్ డౌన్‌లోడ్ చేసి అందరికీ పంపిస్తుంటారా? అయితే అలా కాకుండా మీరే ఎంతో సులువుగా స్టిక్కర్స్‌ను క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. అది నిజంగా చాలా బాగుంటుంది.

 

మ‌రి అది ఎలాగో ఓ లుక్కేసేయండి. వాట్సప్‌లో స్టిక్కర్స్ తయారు చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే వాటిని తయారు చేయడమే కాదు, ఆ స్టిక్కర్లను మీ వాట్సప్‌లోకి పబ్లిష్ చేయడం కూడా ఈజీనే. గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సప్ స్టిక్కర్ మేకర్ అని టైప్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో న్యూ స్టిక్కర్ ప్యాక్‌పైన క్లిక్ చేయాలి. స్టిక్కర్ ప్యాక్‌, ఆథర్ నేమ్ టైప్ చేయాలి.  స్క్రీన్‌లో ముప్పై టైల్స్ మీకు కనిపిస్తాయి. అందులో ఏదైనా ఓ టైల్ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలోంచి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత మీకు కావాల్సినట్టుగా ఫోటో షేప్ కట్ చేయాలి. క్రాప్ చేయడం పూర్తైన తర్వాత స్టిక్కర్ సేవ్ చేయాలి. 

 

మూడు స్టిక్కర్లు యాడ్ చేసిన తర్వాత వాటిని వాట్సప్‌లోకి యాడ్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఎమొజీలో స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్క‌డ‌ మీరు కొత్తగా క్రియేట్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి. అంతే.. మీకు కావాల్సిన వాళ్ల‌కు ఇవి పంపించ‌వ‌చ్చు. అయితే వాట్సప్ స్టిక్కర్ల తయారీ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేముందు.. వాటికి పర్మిషన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ మీ డేటాను కాజేసే ప్రమాదం కూడా ఉంది. సో.. అన్నీ స‌రిగ్గా చూసుకుని.. తెలుసుకున్న తర్వాతే థర్డ్ పార్టీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: