ఇటీవ‌ల కాలంలో ల్యాప్ టాప్స్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. అయితే నేడు మ‌న‌కు ఎంత అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చినా ల్యాప్ టాప్ లు మాత్రం ఇప్ప‌టికీ ఆద‌ర‌ణ‌ను కోల్పోలేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌తో కాని ప‌నులు ల్యాప్‌టాప్‌ల‌తో అవుతున్నాయి క‌దా..! అందుక‌ని వాటి ప‌ట్ల యూజ‌ర్లు ఇప్ప‌టికీ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక ల్యాప్‌టాప్‌లు కొనే ముందు ఫీచర్స్, ర్యామ్, స్టోరేజ్, చిప్ చూసి కొనుగోలు చేస్తారు. మ‌రి వేలకు వేలు పోసి కొనుగోలు చేసే స్మార్ట్ గాడ్జెట్స్ పట్ల ప్రయాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

 

అందుకే.. ల్యాప్‌టాప్ ఉప‌యోగించేవారు ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ట్రావ‌లింగ్ స‌మ‌యంలో ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పబ్లిక్ ప్రాంతాల్లో వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే ముందు కాస్తంత ఆలోచించండి. మీ ల్యాపీలోకి వైరస్‌లను ప్రవేశపెట్టి డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లకు ఇదో మంచి మార్గం. ఇటువంటి సమస్యలను ఎదుర్కొవాలంటే మీ ల్యాప్‌టాప్‌లో సురక్షితమైన యాంటీ స్పైవేర్ వ్యవస్థను అప్ టూ డేట్‌గా లోడై ఉండాలి. ప్రయాణ సమయాల్లో ల్యాప్‌‌టాప్ పవర్‌ను పూర్తిగా ఆఫ్‌చేసి ఉంచటం మంచిది. 

 

జర్నీ సమయంలో ల్యాపీని ఎక్కువ సేపు వినియోగంచటం కారణంగా కుదుపుకు గురయ్యే అవకాశముంది. దీంతో ల్యాపీలోని కాంపోనెంట్లు దెబ్బ తింటాయి. మీ ల్యాప్‌టాప్ మోడల్, సీరియల్ నెంబర్, సర్వీస్ నెంబర్, స్పెసిఫికేషన్స్ వంటి అంశాలను లిఖిత పూర్వకంగా రాసి ఉంచుకోవటం మంచింది. అనుకోని పరిస్థితులలో ల్యాపీ చోరికి గురైనట్లయితే ఇవి చాలా అవ‌స‌రం అవుతాయి. ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బ్యాగ్‌లు మాత్ర‌మే వాడాలి. ఇవి మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం ద్వారా ప్రయాణంలో మీ ల్యాపీ ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: